ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్నాయి. లక్షల పరిక్షలు చేస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో కరోనా పరిక్షలు జరిగిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే దేశంలోనే ఎక్కువ క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన రాష్ట్రంగా ఏపీ చ‌రిత్ర కెక్కింది. ఇక ఏపీలో కరోనా పరీక్షలను చూసి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణా  రాష్ట్రాలు షాక్ అవుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కరోనా పరిక్షలు ముందే చెయ్యాల్సింది అని అంటున్నారు. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఏపీలో ఈ స్థాయిలో కరోనా పరిక్షలు చేయడం తెలంగాణా సీఎం కేసీఆర్ కి తల నొప్పిగా మారింద‌ట‌. అక్కడ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉన్నా సరే ప్రతీ రోజు కూడా 3 వేలకు మించి పరీక్షలు చేయడం లేదు. హైకోర్ట్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విధానం మంచిది కాదు అంటూ హెచ్చరికలు చేస్తున్నా కూడా ప్ర‌భుత్వం ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తోంద‌నేలా ఉంది. హైకోర్ట్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణా సర్కార్ కి తల నొప్పే అని చెప్పాలి. 

 

ఇప్పుడు బిజెపి కూడా వాటిని టార్గెట్ గా చేసుకునే అడుగులు వేస్తుంది. ఏపీ ముందు నుంచి కూడా కరోనా పరిక్షల విషయంలో చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తుంది. ఇప్పుడు పరీక్షల విషయంలో ఆ దూకుడే ఏపీలో కేసులను కొన్ని ప్రాంతాల్లో కట్టడి చేసింది. ఇక ఈ పరిణామం కేసీఆర్ కి ఇబ్బందిగా మారడం తో కరోనా పరిక్షల విషయంలో ఏపీ సర్కార్ సహకారం తీసుకోవాలి అని తెలంగాణా భావిస్తోంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: