హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త సర్వీస్ ని లాంచ్ చేసింది. అయితే దీనిలో జిప్ డ్రైవ్ పేరుతో ఇన్స్టెంట్ గా  ఆటో లోన్ సర్వీసెస్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభించింది. అయితే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దిగ్గజమైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ  కస్టమర్ల కోసం లాంచ్  చేసిన ఈ సర్వీస్ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. నిజంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు ఇది పండుగే. డిజిటల్ జోన్ సర్వీస్ దేశ వ్యాప్తంగా వెయ్యి పట్టణాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే టైర్ 2 , టైర్ 3  పట్టణాల్లో కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయట. 
 
 
 
మన ఆంధ్రప్రదేశ్ లో  భీమవరం, ఉత్తరప్రదేశ్ లోని హర్‌డోయ్, కేరళలోని తలస్సోరి, ఒడిశాలోని బాలసోర్ ప్రాంతాల్లో ఉన్న వారు ఈ సర్వీసులని చక్కగా పొందవచ్చు. చూశారు కదా ఈ ఆఫర్ ఎంతగా అదిరిపోయిందో. ఇన్స్టెంట్ ఆటో లోన్ లో భాగంగా కస్టమర్లు ఈ రుణాలని 10 సెకండ్లు లోనే పొందవచ్చు. అయితే బ్యాంకుకు చెందిన ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ కలిగిన కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందిట. నాన్ మెట్రో ప్రాంతాల్లో వాహన అమ్మకాలు ఎక్కువగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే బయట వాహనాలు కానీ ప్రభుత్వ వాహనాల్లో కానీ వెళితే ఏ క్షణమైనా ముప్పు రావచ్చని అభిప్రాయపడుతున్నారు.
 
 
అయితే ప్రీ అప్రూవ్డ్ లోన్ కలిగిన కస్టమర్లు మాత్రం ఈ రుణాన్ని 10 సెకన్ల లో పొందవచ్చట. అది కూడా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఈ లోన్ పొందడం గమనార్హం. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా 10 సెకన్ల లో డబ్బులు ఆటో డీలర్ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్రీ అప్రూవ్డ్ కలిగినవారు మీ నెట్ బ్యాంకింగ్ నుండి ఈ తరహా లోన్ కి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: