కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్నే సర్వనాశనం చేస్తుంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు అత్యంత భారీగా పెరిగిపోతున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయ్. లాక్ డౌన్ సమయంలో తగ్గినట్టు కనిపించిన ఈ కరోనా కేసులు ఇప్పుడు ప్రపంచం అంత భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.                      

 

ఇంకా ఈ వైరస్ ను ఎదుర్కోవాలంటే ప్రతిమనిషిలో రోగ నిరోధక శక్తి ఉండాలి. మంచి ఆరోగ్యం.. రోగనిరోధక శక్తి ఉంటే అసలు ఏ రోగం మనకు రాదు. ఇంకా అలాంటి రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవాలంటే ఎన్నో మనం తీసుకొనే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు అన్ని ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే గత 5 నెలలుగా ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టచ్చు అని హెర్బల్ టీ అని, లేమాన్ హనీ టీ అని రోజు వార్తల్లో వస్తూనే ఉంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనాకు కరక్కాయ, టీ తో చెక్ పెట్టచ్చు అని ఐఐటీ-ఢిల్లీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అది ఎలా అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

కరక్కాయ, టీ నుంచి తీసిన పదార్థాలకు (గుజ్జు) కరోనా సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతుంది అని, వీటిలో ఉండే గాల్లోటానిన్‌ అనే ప్రత్యేక పదార్థానికి కరోనాను నిరోధించే సామర్థ్యం ఉందని ఈ అధ్యయనం తెలిపింది. 51 ఔషధ మొక్కలను పరిశీలించగా ఇందులో  వైరస్‌ ప్రతిరూపాన్ని నిరోధించడంలో టీ, కరక్కాయల్లోని గాల్లోటానిన్‌ పదార్థం ప్రభావవంతంగా పని చేసింది అని తెలిపారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: