జీవితంలో సక్సెస్ అనేది ఎవరికీ సులభంగా దక్కదు. ఎంతో శ్రమిస్తే మాత్రమే సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కొందరు మాత్రమే కలలను నిజం చేసుకుంటారు. ముంబాయిలో పుట్టిన సవితాగార్జె కూడా చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కల కనింది. ఆ కలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించింది. ఎన్నో అవాంతరాలు ఎదురైనా చివరి క్షణం వరకు పోరాడింది. 
 
లక్ష్య సాధనలో విజయం సాధించి నేడు విజేతగా నిలిచింది. తాజాగా విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఆమె డీఎస్పీగా బాధ్యతలు తీసుకోనుంది. సవిత తండ్రి మారుతి గార్జె ఒక సాధారణ క్లర్క్. ఆయనకు ముగ్గురు సంతానం. చిన్నతనం నుంచి ఆమెకు పోలీస్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె మౌనంగానే ఉండిపోయింది. 
 
తండ్రి సంపాదనతో ముగ్గురు పిల్లలను చదివించడం ఆషామాషీ కాదని తెలిసి సవిత చిన్నచిన్న ఉద్యోగాలు చేసి తండ్రికి తోడ్పాటుగా నిలిచారు. యూపీఎస్సీ కోచింగ్ కొరకు మూడేళ్లు పుణె వెళ్లారు. నెలవారీ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పేది. సెకండ్ హ్యాండ్ లో ల్యాప్ టాప్ కొనుక్కుని నెట్ లో తనకు కావాల్సిన సమాచారం సేకరించుకునేవారు. స్నేహితులంతా హేళన చేసినా రోజంతా లైబ్రరీలోనే గడిపేవారు. 
 
అక్కడ ఆమెను కొంతమంది పోకిరీలు వేధించారు. ఆమె చిన్నప్పటి నుంచి తన లక్ష్యం డీఎస్పీ కావడంతో చిన్నచిన్న సమస్యలను పట్టించుకునేదాన్ని కాదని అన్నారు. ఎంతో మంది అమ్మాయిలకు సవిత స్పూర్తిగా నిలుస్తోంది. సవిత తల్లిదండ్రులు ఆమెను చూసి ఎంతో గర్విస్తున్నారు. కష్టపడితే విజయం సాధించవచ్చని చెప్పడానికి సవిత ఉదాహరణ.                          

మరింత సమాచారం తెలుసుకోండి: