బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ అని చెబుతోంది ఎస్బీఐ. అయితే స్టేట్ బ్యాంకు రుణ రేట్లు బాగా తగ్గించింది. దీని ఫలితంగా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తోంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేక  ఏమైనా ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్నా సొంత ఇంటి కల తీర్చుకోవాలన్న  కచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దేశి అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు భారీ ఆఫర్ ఇచ్చిందని చెప్పాలి .

 

రుణ రేట్లను తగ్గించి చౌక వడ్డీకే హోమ్ లోన్స్ అందుబాటు లోకి తీసుకు వస్తోంది. ఎస్బీఐ  హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ఇప్పటి నుంచి 6 .95 శాతం నుంచి ప్రారంభం అవుతుందని ఎస్బీఐ తెలియ జేసింది.  6.85 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు ఇవ్వనుంది. అయితే ఇప్పుడు ఎస్బీఐ జూన్ రెండో వారం లోనే ఈ రుణం రేట్లు తగ్గిస్తుందని ప్రకటించింది.

 

అయితే దీని మూలంగానే ఇప్పుడు ఎస్బీఐ హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి . ఇది మహిళలకు వర్తిస్తుందని ఎస్బీఐ  తెలియజేసింది. అదే  ఇతరులకు అయితే ఈ వడ్డీ రేట్లు ఏడు శాతం నుంచి ఆరంభమవుతాయి. రూ. 30 లక్షల వరకు రుణానికి ఈ వడ్డీ పడుతుంది.  అదే 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు హోమ్ లోన్స్ వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంటుందట. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటును 7.05 శాతం నుంచి 6.65 శాతానికి తగ్గిస్తామని తెలిపింది.  ఇదిలా ఉండగా ఎన్సీఎల్ రేటు 7.75 శాతం నుంచి 7 శాతానికి కోత విధిస్తున్నట్లు కూడా తెలియజేసింది. అయితే ఈ రేటు తగ్గింపు నిర్ణయాన్ని జూలై 1 నుంచి అమల్లోకి  వచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: