కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలను బలి తీసుకుంటోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీ కొరకు తలమునకలవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ కంపెనీ ఇప్పటికే కరోనా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు పొందింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాపై హైదరాబాద్ లో పరిశోధనలు జరుగుతున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 17 కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నాయి. భారత్ వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో ఇతర దేశాలతో పోలిస్తే ముందు వరసలోనే ఉంది. భారత్ బయోటెక్ కు ఇప్పటికే మానవ ప్రయోగాలకు అనుమతులు లభించగా తాజాగా మరో కంపెనీకి కూడా అనుమతులు లభించాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన జైడస్ కాడిలా హెల్త్ కేర్ రూపొందించిన వ్యాక్సిన్ కు తాజాగా అనుమతులు లభించాయి. 
 
జైడస్ కాడిలా డీసీజీఐ అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్ గా నిలిచింది. తాజా అనుమతులతో మనుషులపై తొలి, రెండవ దశల్లో పరిశోధనలు జరగనున్నాయి. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిపుణుల సిఫార్సుల మేరకు కేంద్రం వ్యాక్సిన్ లకు వేగంగా అనుమతులు ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందువరసలో ఉన్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ మోడెర్నా, ఆస్ట్రాజెనికా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయని ఈ మధ్యే ప్రకటన చేసింది. మోడెర్నో ఈ నెలలో మూడో దశ ప్రయోగాలను చేపట్టనుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ సైతం సత్ఫలితాలను ఇస్తోంది. చైనా కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్, ఫైజర్ కలిసి రూపొందించిన వ్యాక్సిన్ ముందుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: