చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తాను అని చెప్పి హామీ ఇచ్చి నెరవేర్చని తరుణంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం జరిగింది. ఆ సమయములో ముద్రగడ కి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా గాని స్వతహాగా కాపు జాతి కోసం తన కుటుంబంతో సహా అనేక ఇబ్బందులు చంద్రబాబు టైంలో ఎదుర్కోవటం జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం టిడిపి హయాంలో చేసిన దీక్ష అప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు మరియు ఇంకా అనేక రీతులుగా ముద్రగడ పద్మనాభం ని అప్పటి ప్రభుత్వం ఇబ్బందులు చేయటంతో చాలావరకు ముద్రగడ్డ సైలెంట్ అయిపోయారు.

 

ఇదిలా ఉండగా ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన జగన్ కాపు సమస్యల తీరుస్తూ కాపు కార్పొరేషన్ కి భారీ స్థాయిలో నిధులు కేటాయించడంతో ముద్రగడ ఇటువంటి సమయంలో సీఎం జగన్ కి లెటర్ రాయడం జరిగింది. కాపు సమస్యలు తీర్చాలని మరియు కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని లెటర్లో జగన్ ని కోరారు. కాపు జాతి చిరకాల కోరిక బీసీ రిజర్వేషన్లు అని మీరు దాన్ని అమలు చేయాలని లెటర్లో ముద్రగడ పేర్కొన్నారు.

 

మీరు విజయం సాధించటంలో కాపుల పాత్ర ఎంతో ఉందని దయచేసి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ తన లెటర్ లో వేడుకొన్నాడు. కాపు రిజర్వేషన్ల అంశం గురుంచి ప్రధాని మోడీ తో మాట్లాడి అమలు చేయాలని ముద్రగడ సూచించారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు. కాపుల రిజర్వేషన్ల అంశం కూడా తీర్చాలని ముద్రగడ్డ అభ్యర్థించారు. ఈ తరుణంలో గతంలో కాపులు చేసిన పోరాటానికి వైసీపీ మద్దతు ఇచ్చిన దాన్ని ముద్రగడ లెటర్ లో గుర్తుచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: