ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కాస్త ఆశ్చర్యాన్ని, మరి కాస్త గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుంటూ, ఆ పార్టీని బలహీనం చేసే క్రమంలో ముందుకు వెళ్తూ, మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా, సొంత పార్టీ ఎంపీ అసమ్మతి గళం వినిపించడమే కాకుండా, పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కొద్దిరోజులుగా గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతమైన నరసాపురం నుంచి వైసిపి తరపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు గెలిచిన దగ్గర నుంచి, అనుమానస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన బిజెపి నాయకులతో సఖ్యతగా ఉంటూ ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం వైసీపీలో మొదలైంది.

IHG


 అప్పటి నుంచి ఆయన వ్యవహార శైలిపై ఒక కన్నేసి ఉంచింది వైసీపీ. తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వం పైన, అధినేత జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఆయనపై అనర్హత వేటు పడితే, ఆయన స్థానంలో నరసాపురం నుంచి బరిలోకి దిగేది ఎవరనే లెక్కలు అప్పుడే వైసీపీలో మొదలయ్యాయి. ఈ క్రమంలో టిడిపి మాజీ మంత్రి, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ముద్రపడిన పితాని సత్యనారాయణ పేరు తెర మీదకు వస్తోంది. డెల్టా ప్రాంతంలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న పితాని 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగ బరిలోకి దిగీ ఆయన విజయం సాధించారు.


 ఇక ఆ తర్వాత ఏపీ, తెలంగాణ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 63 వేల ఓట్లతో విజయం సాధించారు  2019 ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రస్తుత ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు చేతులో ఓటమి చెందారు. అయినా,  ఆయన 53 వేల ఓట్లు సాధించి నియోజకవర్గంలో తన పట్టును నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీలో చేర్చుకుని, నరసాపురం నుంచి బరిలోకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈఎస్ఐ స్కాం లో పితాని పేరు వినిపిస్తుండటంతో, ఆయన వైసీపీలో చేరితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని, ఆ పార్టీ నుంచి పిలుపులు కూడా వస్తున్నాయట. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నా, రాజకీయ భవిష్యత్తు అయోమయం గా ఉండే అవకాశం ఉండటంతో, ఆయన కూడా వైసీపీలో చేరే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. 

 

IHG

 

రఘురామకృష్ణంరాజు కు ఊహించని విధంగా, దెబ్బ కొట్టాలంటే ఆయనను చేర్చుకోవడమే కరెక్ట్ అనే ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉంది. ఈ మేరకు ఆయన పై ఒత్తిడి పెంచితే ఖచ్చితంగా పార్టీలోకి వస్తారనే అభిప్రాయం నేతల్లో ఉంది. కాకపోతే పితానిపై పోటీ చేసి గెలుపొంది, ప్రస్తుతం మంత్రి పదవి అనుభవిస్తున్న శ్రీరంగనాథరాజు మాత్రం అతని రాకను అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఆయనను పార్టీలో చేర్చుకుంటే, తన హవా తగ్గుతుంది అనే అభిప్రాయంలో ఆయన ఉన్నారట. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రంగనాథ రాజును ఏ విధంగా ఒప్పించి  పితానిని పార్టీలోకి తీసుకొస్తుందో.. రఘురామకృష్ణంరాజు కు ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: