మందు బాబు బీజీగా మారిపోయారు. సరుకు ఎక్కడ దొరకుతుందో అక్కడ వాలిపోతున్నారు. మళ్లీ లాక్ డౌన్ పెడతారేమోనన్న డౌట్ తో కిందటిసారిలా సరుకు లేక ఇబ్బందిపడకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉన్నారు. మరోవైపు రెండు మూడు రోజులుగా డిపోల నుండి పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. 


మళ్ళీ లాక్ డౌన్ ఉండే అవకాశాలు కనిపిస్తుండటం,  పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం తో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి... గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం ప్రియులు ముందు జాగ్రత్త పడుతున్నారు.

 

మార్చి 22 న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టింది. అప్పటి నుండి మే 6 వరకు తెలంగాణ లో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. ఆ మద్యం దుకాణాలు అకస్మాత్తుగా బంద్ కావడం తో మందు ప్రియులు పడ్డ తిప్పలు అంత ఇంత కాదు... ఎంత పెట్టి అయిన మద్యం కొనడానికైనా సిద్ధమయ్యారు. 

 

మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్ పెట్టాలని వైద్య నిపుణులు సూచించడం.... పరిస్థితిని సమీక్షించి మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ అనడంతో మళ్ళీ లాక్ డౌన్ వుంటుందనే అభిప్రాయానికి జనాలు వచ్చారు. లాక్ డౌన్ ప్రకటిస్తే ఎక్కడ తమకు చుక్క దొరక్క చిక్కుల్లో పడతామన్న టెన్షన్ తో మద్యం ప్రియులు ముందే స్టాక్ కొనేసి పెట్టుకుంటున్నారు. 

 

లాక్ డౌన్ సడలింపు తర్వాత.. మద్యం షాపుల దగ్గర ఎంత రష్ కనబడందో.,. అ స్థాయిలోనే జనం..  రెండు మూడు రోజులుగా  క్యూ కడుతున్నారు. జూన్ 29 న 185 కోట్ల 45 లక్షలు.. జూన్ 30 న 164 కోట్ల మద్యం అమ్మకాలు డిపోల నుండి జరిగాయి. జూన్ నెలలో 2 వేల 389 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే కేవలం సోమ మంగళ వారాల్లో నే సుమారు 350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: