గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ ఎంసీ కొరడా ఝళిపిస్తుంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలతో పాటు ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు బల్దియా సిబ్బంది. జీహెచ్ ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించడానికి స్పెషల్ డ్రైవ్ ను బల్దియా  చేపట్టింది.

 

నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలతోపాటు.... ప్రధానంగా మాదాపూర్ కేంద్రంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. గడిచిన రెండు రోజులుగా ఈ ప్రాంతంలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను కూలుస్తున్నారు.  

 

ఇక లాక్ డౌన్ ను అసరాగా తీసుకున్న కొంత మంది అక్రమ నిర్మాణాలకు తెర తీశారు. గ్రేటర్ పరిధిలో జీహెచ్ ఎంసీ అధికారులు కరోనా నియంత్రణ చర్యల్లో తలమునకలయ్యారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుండి ఉన్నతాధికారుల వరకు అందరూ కరోనా డ్యూటీలోనే ఉన్నారు.

 

ఇదే అదునుగా అక్రమనిర్మాణాలు ఊపందుకున్నాయి.  గడిచిన రెండు రోజులుగా తొమ్మిది భారీ నిర్మాణాలను కూల్చి వేశారు. కొన్నింటిని పూర్తిగా నేలమట్టం చెయ్యగా,  మరికొన్నింటిని నిర్మాణానికి పనికి రాకుండా గ్యాస్ కట్టర్లతో కట్ చేశారు. 

 

టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారికి  11 కంప్రెసర్లు, 3 గ్యాస్ కట్టర్లు, 2 జేసీబీలను అందించి కూల్చివేతలు చేపట్టారు.  మూడు గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్స్ తోపాటుగా... నిర్మాణంలో వున్న  ఆరు భవనాలను పూర్తిగా కూల్చివేశామంటున్నాయి బల్దియా వర్గాలు.

 

ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జీహెచ్ ఎంసీ సర్వే నిర్వహించింది. గురుకుల్ ట్రస్ట్ భూమలుల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు  జీహెచ్ ఎంసీ గుర్తించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్  చేపట్టామన్న బల్దియా,  గడిచి వారంలో రోజుల్లో 15 అక్రమ నిర్మాణాలు కూల్చి వేశామంటుంది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: