నేపాల్‌కు భార‌త్‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ర‌హ‌దారి వివాదాన్ని చైనా మ‌రింత ముదిరేలా చేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల్లో కొంత‌మందిని భార‌త్‌పైకి ఉసిగొల్పేందుకు ఏకంగా డ‌బ్బు ఆశ‌కూడా చూపుతున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. అంతేకాకుండా నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులో జ‌రుగుతున్న రాజ‌కీయ విష‌యాల‌పై చైనా గుడాచారులు ఎప్ప‌టిక‌ప్పుడు డ్రాగ‌న్ అధ్య‌క్ష కార్యాల‌యానికి నేరుగా చేరవేస్తున్న‌ట్లుగా మీడియాలో కూడా క‌థ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా  నేపాల్ లోని ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని చైనా తన ప్రయోజనాలకు అనువుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దేశంపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ. ఖాట్మండులో . తమ గూఢచారులను.. కరోనా పై పోరు జరిపే డాక్టర్లుగా ప్రవేశపెట్టినట్టు సమాచారం.


నేపాల్‌లో రాజకీయ ఉద్యమం తీవ్రమైంది. ప్రధానమంత్రి పీఠం నుంచి వైదొలగాలని కేపీ శర్మ ఒలిపై ఒత్తిడి పెరుగుతున్నది. షీతల్ నివాస్‌లో అధ్యక్షుడు బిద్యాదేవి భండారితో ఒలి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాన్ని రద్దు చేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. బలూవతార్‌లోని ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వ నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, బలూవతార్‌లో నడుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి కేపీ శర్మ ఒలి హాజరుకాలేదు. ప్రధాని కేపీ శర్మ ఒలి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండల మధ్య వివాదం పెరుగుతూనే ఉంది. 


నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలన్న డిమాండ్ అక్కడ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై భారత ప్రభావాన్ని తగ్గించేందుకు చైనాతో బాటు పాకిస్తాన్ కూడా పెద్ద కుట్ర పన్నుతోందని  భారత సెక్యూరిటీ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన మిలిటరీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ తన ఉనికిని నేపాల్ లో పెంచుకోవడం కోసం  శర్మ ఓలికి త‌మ మ‌ద్దతును ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే డ్రాగ‌న్ డైరెక్ష‌న్‌లో రాజ‌కీయాల‌ను న‌డిపేందుకు నేపాల్ ప్ర‌జ‌లు, పార్టీలు సిద్ధంగా లేవ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు, పార్టీల నేత‌లు బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. డ్రాగ‌న్ త‌మ దేశ వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చకుండా ఉంటే మంచి భార‌త్‌తో త‌లెత్తిన వివాదాల‌ను తాము ప‌రిష్క‌రించుకోగ‌ల‌మ‌ని హిత‌వు ప‌లుకుతుండ‌టం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: