కరోనా మన జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సమస్యలున్న వాళ్లు, వయస్సు మళ్లిన వాళ్లంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెల్‌ సదుపాయం కల్పించింది. 

 

ప్రపంచానికి పీడలా మారింది కరోనా వైరస్‌. దీంతో ఆరోగ్య సమస్యలున్న వాళ్లు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కిడ్నీ, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ల బయట తిరగొద్దని పదే పదే చెబుతున్నారు అధికారులు. గడప దాటాలంటే ముఖానికి మాస్క్‌, ప్రయాణం దగ్గర నుంచి వర్క్‌ప్లేస్‌ వరకూ ప్రతి చోటా వ్యక్తిగత దూరం, దేన్ని తాకినా చేతులు కడుక్కోవడం, శానిటైజర్‌ పూసుకోవడం నిత్యకృత్యంగా మారిపోయాయి.

 

ఇదిలా ఉంటే... వచ్చే అక్టోబర్‌-నవంబర్లలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్‌. 65 ఏళ్ల పైబడిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోడానికి అనుతిచ్చింది. కరోనా బాధితులు, హోం క్వారంటైన్లో ఉన్న వాళ్ల కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.  

 

గతంలో 80 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉండేది. కానీ... ఇప్పుడు వయో పరిమితిని ఈసీ 65 ఏళ్లకు కుదించింది. పోస్టల్‌ బ్యాలెట్‌కు వయోపరిమితిని కుదించడంతో పాటు, కరోనా బారిన పడిన వాళ్లు ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. 

 

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. లక్షలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన ఈ మహమ్మారి.. లక్షలాది మంది ప్రాణాలు హరించేసింది. ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ భారత్ లోని బీహార్ లో జరిగే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే ఎన్నికలు జరుగనుండంటతో  వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: