ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,08,03,599 కరోనా‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,18,968కి చేరింది.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 43,45,614 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,57,985.  గత 24 గంటల్లో కొత్తగా 52,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,79,953గా ఉంది. అమెరికాలో మృతుల సంఖ్య 1,30,798కి చేరింది. ఇప్పటివరకు 11,64,680 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రుల్లో 14,84,475 మంది కరోనా రోగులకు చికిత్స అందుతోంది.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు కోటి 8 లక్షలు దాటాయి.

 

అటు మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది.  ఇక అగ్రరాజ్యంలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ లక్షా 30 వేల 798 మంది మరణించారు. అమెరికా తరువాత బ్రెజిల్ లో కరోనా ఉదృతి అధికంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకూ 14లక్షల 56వేల 369 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం ఒక్క రోజే ఆ దేశంలో 45వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

 

ఆదేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 60వేల 713 మంది మరణించారు.  న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.  ఒక్క ఫ్లోరిడా రాష్ట్రంలోనే గురువారం 10,109 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. కాగా, ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒకేరోజు ఇన్ని కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసార‌ని అక్క‌డి అధికారులు తెలిపారు.  

 

ఇతర దేశాల్లో కరోనా కేసుల వివరాలు :


రష్యాలో మొత్తం కేసులు: 6,54,405
మృతుల సంఖ్య: 9536  

యూకేలో మొత్తం కేసులు: 3,13,483
మృతుల సంఖ్య: 43,906

స్పెయిన్‌లో మొత్తం కేసులు:  2,96,739
మృతుల సంఖ్య: 28,363

పెరులో మొత్తం కేసులు: 2,88,477
మృతుల సంఖ్య: 9860

చిలీలో మొత్తం కేసులు:  2,82,043
మృతుల సంఖ్య: 5753

మరింత సమాచారం తెలుసుకోండి: