భారత్ చైనాకు వరుస షాకులిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్ లపై నిషేధం విధించిన భారత్ ఆ దేశం విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. గల్వాన్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు మరణించటాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్ నుంచి చైనాకు ఆర్థికంగా ప్రయోజనం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. భారత్ నేషనల్ హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతులు లేవని ఇప్పటికే ప్రకటన చేసింది. 
 
చైనా వస్తువుల బహిష్కరణ దిశగా భారత్ అడుగులు వెస్తోంది. ప్రధాని మోదీ నేడు లడఖ్ పర్యటనలో మాట్లాడుతూ చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే సైనికులు వీరత్వం చూపిస్తారని మన జవాన్లను ప్రశంసిస్తూ చైనాపై ఘాటుగా విమర్శలు చేశారు. భారత్ చైనాకు షాక్ ఇస్తూ రష్యాకు ప్రయోజనం చేకూరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మిత్రదేశమైన రష్యాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా లబ్ధి చేకూరనుంది. 
 
భారత్ ఇప్పటికే అత్యాధునిక ఆయుధాలను, యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. భారత్ భారీఎత్తున మిగ్ 29 ఫైబర్ జెట్ విమానాలు 21 కొనుగోలు చేస్తోంది. ఎఫ్.యు.30 యుద్ధవిమానాలు 12 కొనుగోలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న యుద్ధవిమానాలను భారత్ ఆధునీకరించే ప్రతిపాదనలు చేస్తోంది. కేంద్రం నావీ ఎయిర్ ఫోర్స్ కోసం అస్త్రా మిస్సైల్ లను సిద్ధం చేస్తోంది. 
 
భారత్ చైనా యుద్ధానికి సిద్ధమైనా ధీటుగా జవాబు ఇవ్వడానికి వీటిని కొనుగోలు చేస్తోంది. కొనుగోళ్ల ద్వారా 38,000 కోట్ల రూపాయలు రష్యాకు ప్రయోజనం కలగనుంది. చైనా రష్యా కూడా సన్నిహిత దేశాలే అయినప్పటికీ రష్యా భారత్ కు ఆయుధాలు ఇవ్వకుండా ఆపే సామర్థ్యం చైనాకు లేదు. చైనా దుర్మార్గపు పోకడల వల్ల భారత్ అత్యవసరంగా ఆయుధాలను, విమానాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ చైనా మధ్య వివాదం రష్యాకు లాభం చేకూరుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: