ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల రావు  డైలాగ్... సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల... ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది? అవును మనిషి తల్చుకుంటే అసాద్యం అనేదే లేదు అని ఎంతో మంది చేసి చూపించారు.  ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరిచే షభాష్ అనిపించుకుంటున్నారు. ఈ మద్య ఓ యువకుడు మూడు గుడ్లు టవర్ లా నిలిపి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు.

 

తాజాగా ఓ యువకుడు చేసిన విన్యాసానికి ఔరా అని ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నవారు. ఇక ఈ వీడియో ఇప్సుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. సాధారణంగా రొటీన్ కి భిన్నంగా ఏదైనా వెరైటీ చేస్తేనే ప్రజలను ఆకర్షించగలం.. ఈ విలువైన మాటలు ఆ యువకుడు బాగా తెలుసుకున్నాడు. ఎవ‌రూ చేయ‌లేని విధంగా ఒక యువ‌కుడు త‌న రెండు చేతుల‌తో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు.  రెండు గ్లాసుల‌లో ఉన్న‌ నీరు ఒక డ్రాప్ కూడా కింద ప‌డ‌క‌పోవ‌డంతో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న‌ది. బ్యాలెన్స్ చేయ‌డానికి ఒక తాడు తీసుకున్నాడు. ఈ రెండు గ్లాసుల‌లో నీరు పోసి త్రాసులాగ రెండింటినీ అమ‌ర్చాడు.

 

ఆ త‌ర్వాత రెండింటికీ తాడు క‌ట్టి రెండు చేతుల‌తో ప‌ట్టుకొని నెమ్మ‌దిగా స్టార్ట్ చేసి త‌ర్వాత గిరా గిరా తిప్పసాగాడు.  కర్రసాము చేసినట్లు అవలీలగా చేశాడు.. ఆ సమయంలో ఒక్కనీటి చుక్కకూడా కింద పడలేదు. తీరా ప్ర‌ద‌ర్శ‌న అయ్యాక ఆ రెండు గ్లాసుల‌లో ఎన్ని నీళ్లు అయితే పోశాడో అన్నే ఉన్నాయి.   59 సెంక‌డ్ల పాటు న‌డిచే ఈ వీడియోను ఫిజిక్స్ అండ్ ఆస్ట్రాన‌మీ జోన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘భౌతికశాస్త్రంతో చేసిన అందమైన ప్రదర్శన’ అనే శీర్షిక‌ను జోడించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని 1.9 మిలియ‌న్ల మంది వీక్షించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: