దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వాస్తవానికి ఒక ప్రమాదకరమైన వైరస్. యావత్ ప్రపంచం వైరస్ ధాటికి గజగజా వణుకుతోంది. వైరస్ విజృంభణ వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారత్ అభివృద్ధి కూడా కుంటుపడింది. 
 
అయితే కరోనా వల్ల కలిగిన ఒకే ఒక ప్రయోజనం ఏమిటంటే మాత్రం భారత్ ను వైరస్ పదేళ్ల ముందుకు తెచ్చింది. గతంలో నోట్ల రద్దు సందర్భంలో భారత్ లో పేటీఎం, ఫ్రీ చార్జ్ ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కరోనా వల్ల డిజిటల్ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఈ పేమెంట్స్ విధానంగా శరవేగంగా అభివృద్ధి చెందింది. డిజిటల్ పేమెంట్స్ వినియోగం ప్రస్తుతం పతాకస్థాయికి చేరింది. 
 
ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఆస్పత్రుల సంఖ్య తగ్గడంతో పాటు డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ల చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా రాజకీయ నేతలు ప్రస్తుతం సమావేశాలను నిర్వహిస్తున్నారు. గతంలో విదేశాలలో ఈ విధంగా సమావేశాలు జరుగుతాయని భారత్ లో చర్చ జరిగేది. 
 
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతోంది. విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కాకపోయినా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సమయం వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించారు. ఓటింగ్ విధానంలో కూడా మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యత పెరిగింది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: