చైనాకు షాక్ ఇచ్చే సమయం ఆసన్నమైంది. అందుకే ఏకంగా ఒక దేశ ప్రధాని సరిహద్దుల్లోకి వచ్చారు. యుధ్ధ భూమిని ముద్దాడారు. చరిత్ర ఎపుడూ ఒకేలా ఉండదని కూడా చైనాకు చెప్పేందుకే మోడీ లడక్ టూర్ వేశారు. అది కూడా అనూహ్యంగా వచ్చారు. ఈ దెబ్బకు చైనాకి చలిజ్వరం వచ్చేసింది. ఇంతోటి దానికి ఉద్రిక్తత‌లు ఎందుకులే. చర్చలు జరుపుకుందామంటూ మాయదారి మాటలు మాట్లాడుతోంది.

 

అంటే డ్రాగన్ కి నిండా తడిసిపోతోంది అన్న మాట. భారత్ ఏ మాత్రం మాదగ్గర అనుకున్న డ్రాగన్ ఇపుడు లాగులు తడుపుకుంటున్న సీన్ కనిపిస్తోంది. చైన కళ్ళలో భయం కనిపిస్తోంది. ఇది చాలు మోడీ సర్కార్ ఏం సాధించింది అని అడిగిన వారికి సరైన జవాబు చెప్పడానికి. ఇక మోడీ ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారనుకున్న విపక్షానికి కూడా లడక్ టూర్ తో తనే సమాధానం అయ్యారు.

 

నా మౌనం ఒక విలయాగ్ని అంటూ సరిహద్దుల్లోనే గర్జించారు. ఇక మోడీ సరిహద్దులకు వెళ్లడం వెనక ఎంతో  వ్యూహం ఉంది. ప్రపంచ దేశాలకు కూడా ఇదొక సంకేతం, ఈ చైనా పని పట్టేందుకు మేము రెడీ, మీలో ఎవరు ముందు వస్తారో, మద్దతు ఇస్తారో తేల్చుకోండి అంటూ మోడీ గట్టి సందేశమే పంపారు.

 

ఇప్పటికే అమెరికా మద్దతుగా నిలిచింది. జపాన్ కూడా ఇపుడు సై అంది. ఇక అంతే కాదు, యూరోపియన్ దేశాలు కూడా మోడీ వెంటే అనే పరిస్థితి ఉంది. అవును కానీ తెలిసి తెలిసి రాంగ్ టైంలో చైనా కాలు దువ్వింది. ఓ వైపు కరోనా వైరస్ అంటించిన నీచ చరిత్రను దగ్గర పెట్టుకుని అందరూ చీకొడుతున్న వేళ ఇపుడు భారత్ లాంటి శాంతి కాముక దేశం మీద దండెత్తాలనుకుంటే కుదురుతుందా. అందుకే చైనా కుడితిలో పడిన ఎలుక అయింది.

 

సరైన సమయమే చూసే మోడీ సరిహద్దుల్లోకి వచ్చారు. హద్దు మీరుతున్న చైనాకు గట్టి ఝలక్ ఇచ్చారు. మరో వైపు కేంద్ర మంత్రులతో కూడా కీలకమైన సమావేశం ఉందని అంటున్నారు మొత్తానికి యుధ్ధం అనివార్యం అని కేంద్రం చెప్పేసింది. ఇక రాజీకి రావడంతో, మొత్తానికి మొత్తం కుప్ప‌ కూలడమో చైనావే ఆలోచించుకోవాలి మరి అద్గతీ కార్నర్ లో పెట్టి బొంగరం ఆడడం అంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: