ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరు జాతీయ స్థాయిలో పాటు శత్రువులను సైతం ఆకట్టుకునే విధంగా మారింది. తాజాగా సీఎం జగన్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహమ్మారి కరోనా కట్టడి విషయంలో మూడు నెలల నుండి ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు అభినందనీయమని తెలిపారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రశంసించారు. ఇదే సమయంలో అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ సేవలను అందించే అంబులెన్సులను ప్రారంభించడం కూడా అభినందనీయమని కొనియాడారు.

 

ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ నేతలు మరియు మీడియా ప్రతినిధులు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఇలాంటి ఘోరమైన కరోనా సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్ లు జగన్ ప్రారంభించడం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన కొంతమంది నేతలు కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలను మెచ్చుకుంటున్నారు. చాలా వరకు కరోనా సంక్షోభ సమయంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల కార్యక్రమాలు అదే విధంగా అభివృద్ధి చాలా అద్భుతంగా జరిగింది అంటూ జగన్ పై పొగడ్తల వర్షం జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కురిపిస్తున్నారు.

 

చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడుతున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినాగానీ ఏడాదిలోనే ఈ స్థాయిలో పరిపాలన ఉంది అంటే రాబోయే రోజుల్లో ఏపీ రూపురేఖలు వైయస్ జగన్ ఆధ్వర్యంలో మారటం గ్యారెంటీ అని చాలామంది జగన్ ఎడ్మినిస్ట్రేషన్ ని కొనియాడుతున్నారు. ఈ విధంగా ఒక పక్క జాతీయస్థాయిలో మరో పక్క రాష్ట్రంలో తన ని విమర్శించిన నేతలతోనే జగన్ ప్రశంశలు అందుకోవడంతో వైసీపీ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: