గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటేనే నేర చరిత్ర కలిగిన రాష్ట్రం అని అనుకునే వారు. తరతరాల నుండి  హత్యలు మానభంగాలు దొంగతనాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిరకాల నేరాల తో దేశం లో కేరాఫ్ అడ్రస్ గా ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. రాజకీయ బుజ్జగింపు ల కారణంగా నేరాలు ఎన్ని  జరిగిన నాయకులు  అందరూ చూసి చూడకుండా వదిలేశారు అన్న టాక్ కూడా ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఎక్కువ అధికారం లోకి యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

 

 నేరాలకు పాల్పడుతున్న రౌడీలను ఎన్కౌంటర్ చేయించడం.., కఠిన శిక్షలు అమలు చేయడం.. నేరాల నియంత్రణ లో  ఎక్కడ వెనకడుగు వేయక పోవడం.. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అటు ఉత్తర ప్రదేశ్ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. కనుక పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నిక ల్లో బిజెపి పార్టీ కి పట్టం కట్టారు ఉత్తరప్రదేశ్ ప్రజలు. ఇలాంటి నేపథ్యం లో తాజాగా ఓ రౌడీ యోగి సర్కార్ కి సవాల్ విసిరాడు అనే  చెప్పాలి. 

 

 దూబే అనే  రౌడీషీటర్ అరెస్ట్ చేయడానికి పోలీసులు తన ఇంటి వద్దకు వెళ్లినప్పుడు.. పోలీసుల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.. ఇక ఈ ఘటన లో  ఏకంగా 8 మంది పోలీసులు మరణించ గా 6 మంది  తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రస్తుతం సదరు నేరస్థుడు పరారీ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా డిప్యూటీ ఎస్పీ  స్థాయి అధికారి సైతం మరణించారు. ఈ ఘటన నేపథ్యం లో ప్రస్తుతం యోగి సర్కార్ కి రెండు పెద్ద సవాలు మారింది అని అంటున్నారు విశ్లేషకులు.  ఈ ఘటనని అస్త్రంగా తీసుకుని  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్షాలు. మరి యోగి  సర్కార్  తన సత్తా ఎలా చూపించబోతుంది  అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: