ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరులు మాజీ  మార్కెట్ కమిటీ  చైర్మన్ అయిన భాస్కర్ రావు హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వాహనంపై వెళ్తున్న భాస్కరరావును  అడ్డగించి దుండగులు కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అయితే ఈ కేసులో అటు పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు సంబంధించిన అనుచరులు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు అని ఆరోపణలు రావడంతో ప్రస్తుతం మాజీ మంత్రి రవీంద్ర  అదృశ్యమయ్యారు. 

 

 ఎందుకంటే భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు కూడా నమోదు చేయబడింది . అయితే ప్రస్తుత మంత్రి కి సంబంధించినటువంటి అనుచరున్ని మాజీమంత్రి కి సంబంధించినటువంటి అనుచరులు  దాడి జరిపి  హత్య చేయడం... నేపథ్యంలో ప్రస్తుతం కొల్లు రవీంద్ర పేరు కూడా హత్య కేసులో నిందితుడిగా నమోదవడంతో పోలీస్ లకు చిక్కకుండా  పరారీలో ఉన్నారని అంటున్నారు, అయితే టీడీపీకి చెందిన మరికొంతమంది మాజీ మంత్రులు ఇలాంటి కేసులుసరైనవి కాదు అని ఆరోపిస్తున్నారు. 

 

 అయితే ప్రస్తుతం భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న రవీంద్ర అరెస్టు చేసి విచారించేందుకు పోలీసులు నిర్ణయించగా  ప్రస్తుతం కొల్లు రవీంద్ర మాత్రం అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొల్లు రవీంద్ర ఆయన సెల్ ఫోన్ ని కూడా పక్కన పెట్టారు అని టాక్.  ఎందుకంటే సెల్ఫోన్ ఉంటే సిగ్నల్ ఆధారంగా పోలీసులు ట్రేస్  చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫోన్ను కూడా దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైకోర్టును ఆశ్రయించి ఆంటీస్పేటరీ  బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అని అంటు టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: