చైనా గురించి చెప్పాలంటే బాబోయ్ చాలానే ఉంటోంది కధ. ఎంత చెప్పినా తర్గిపోని కధ అది. పూర్వం ఎపుడో చిన్న చిన్న రాజ్యాలు రాజులు ఉన్నపుడు సామ్రాజ్య విస్తరణ కాంక్ష బలంగా ఉండేది. నాడు ఎంత రాజ్యం ఉన్నా పక్కవాడి నుంచి ఆక్ర‌మించాలన్న ఆరాటం, దురంకారంతో యుధ్ధాలు చేసి ప్రాణాలు ఫణంగా పెట్టే కధలు ఎన్నో చరిత్ర పుటల్లో  కనిపిస్తాయి.

 

ఇపుడు చూస్తే మాత్రం ఆధునిక జీవితం సమాజంలో ఉంది. దేశాలు కూడా హద్దులూ పద్దులూ తెలుసుకుని మర్యాదగా మంచిగా ఉంటున్నాయి. ప్రతీ దేశం మరో దేశంతో పోటీ పడాలనుకుంటోంది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన నేపధ్యంలో అంతా కలసి ఎదగాలని అనుకుంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటూ అలా వాణిజ్య వర్తకాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 

అక్కడక్కడ చిన్న దేశాలు మూర్ఖంగా వ్యవహరిస్తే ఉండవచ్చు కాక పెద్ద దేశాలు ఎపుడూ జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాయి. కానీ వీటికి భిన్నమైనది మాత్రం చైనావే అని చెప్పాలి. చైనా ఆది నుంచి ఒకటే బాధతో ఉంటోంది. ఇతరుల భూభాగాలను ఆక్రమించాలని చూస్తోంది. ఏదో ఒక తగువు పెట్టుకుని వారి నుంచి భూములు కబ్జా చేస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం. ఈ విధంగా చైనా చాలా దేశాల నుంచి ఏకంగా ఇప్పటికి లక్ష కిలోమీటర్లకు పైగా భూమిని లాగేసింది. అదంతా తనలో కలిపేసుకుంది.

 


ఇక ఇపుడు గ్వాలిన్ లోయ మీద చైనా కన్ను పడింది. అంతే కాదు, భారత్ లోని సిక్కిం, అరుణాచల ప్రదేశ్ తో పాటు లఢక్ ని కూడా తీసేసుకోవాలని చూస్తోంది. అలాగే భూటాన్, నేపాల్ దాని తరువాత జాబితాలో ఉన్నాయి. ఇక పోతే మరో దేశం రష్యాతో కూడా భూతగదాలు చైనా తాజాగా పడుతోంది. ఇలా అన్ని దేశాలతోనూ, దక్షీణ సముద్రంలోనూ దురాక్రమణ‌లు చేస్తూ తన తెంపరితనాన్ని చాటుకుంటోంది.

 

ఈ చైనాకు బుద్ధి చెప్పాలని ఇపుడు భారత కంకణం కట్టుకుంది. అందుకే సరిహద్దుల దాకా వెళ్ళి ప్రధాని మోడీ మీ విస్తరణ‌ దురహంకారం ఇక చెల్లదు అని గట్టి వార్నింగు ఇచ్చేశారు. ఇతరుల సార్వభౌమాధికారాన్ని కూడా గౌరవించి బతకమని హితవు చెప్పారు. మరి చైనా వినకపోతే అందరూ కలసి గట్టిగా పాఠం చెప్పడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: