తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడం, కరోనా టెస్ట్ లు నిర్వహించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి పరిణామాలపై కొద్దిరోజులుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. కరోనా కేసుల సంఖ్య ను ప్రభుత్వం దాచిపెడుతోంది అంటూ విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తున్నా, ఆ పార్టీలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు సైతం ఈ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీరుని తప్పుపట్టినా, ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదని విపక్షాల మాట. ఇక ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీ పడుతున్నాయి.

 

తాజాగా  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతూ, ఆందోళనకు గురి చేస్తోందని ఆయన ట్విట్టర్ ద్వారా  విమర్శించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, గురువారం రాత్రి వరకు రాష్ట్రంలో 18570 కరుణ పాజిటివ్ కేసులు ఉండగా, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డాష్ బోర్డు లో మాత్రం 21393 కేసులు చూపిస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.

 

జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు.మీడియా బులిటెన్ లో చెప్పిన లెక్కలకు, డాష్ బోర్డు లో కనిపిస్తున్న లెక్కలకు 3000 తేడా ఉందని, దీనిని బట్టి ప్రభుత్వం ఈ లెక్కలను దాచిపెడుతుంది అనే విషయం అర్థమవుతుంది అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: