కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈరోజు ఏకంగా పాజిటివ్ కేసుల సంఖ్య 200 దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో 211కేసులు నమోదయినట్లు  రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4964కు చేరగా అందులో ప్రస్తుతం 2098కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 2839మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 25 మంది మరణించారు.   
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తమిళనాడులో ఈ ఒక్క రోజే 4329 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది దాంతో ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో కొనసాగుతుంది అలాగే కర్ణాటకలో ఈరోజు ఏకంగా 1694కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 19710కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 837కేసులు నమోదు కాగా తెలంగాణ లోనైతే ఈరోజు 1892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో ఈఒక్క రోజే 23000కు పైగా పాజిటివ్  కేసులు నమోదయ్యాయని సమాచారం. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 640000కరోనా కేసులు నమోదుకాగా 18500కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: