కరోనా వైరస్.. ప్రపంచమంతా గజగజ వణికిపోతుంది ఈ పేరు వింటే. చైనాలో పుట్టిన ఈ వైరస్ సోకకుండా ప్రజలంతా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు ప్రజలు ఎక్కడ వైరస్ సోకుతుందో అని ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా అలాంటి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం పోయి కొందరు ఆకతాయిలు నిబంధనలు పాటించకుండా.. వ్యాప్తి చెందేందుకు రకరకాల ఐడియాలు ఇస్తున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే తాజాగా ''కోవిడ్-19 పార్టీ'' పేరుతో ఓ దిక్కుమాలిన ప్రకటన చేశారు. షాక్ అయ్యారు కదా! ప్రతిఒక్కరు షాక్ అవుతారు. ఆ పార్టీనే కాదు ఇంకా పార్టీకి సంబంధించిన మరొక విషయం తెలిస్తే ఒక్కసారిగా బెదిరిపోతారు. అది ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్న.  

 

అమెరికాలోని అలబామాలో కొంతమంది విద్యార్థులు ''కోవిడ్-19 పార్టీ''కి పిలుపునిచ్చారు. ఆ పార్టీ మెయిన్ మోటివ్ కరోనా వైరస్ అంటించుకొనే పార్టీ. ఇంకా ఈ పార్టీకి ఒక కోవిడ్-19 బాధితుడిని ఆహ్వానిస్తారు నిర్వాహకులు. ఇంకా పార్టీలో పాల్గొనే యువత కరోనా బాధితుడి నుంచి వైరస్‌ను అంటించుకోడానికి ప్రయత్నించాలి. 

 

అంతేకాదు.. ఆ పార్టీలో ఒక హుండీ ఉంటుంది. ఇంకా ఆ పార్టీకి హాజరయ్యేవారు ఆ హుండీలో డబ్బులు వెయ్యాలి. అయితే పార్టీ ముగిసిన తర్వాత ఎవరికైతే కరోనా వైరస్ పాజిటివ్ వస్తుందో వారిని విజేత నిర్ణయిస్తారు. ఇంకా ఆ హుండీలో ఉన్న డబ్బు అంత ఆ కరోనా పేషంట్ కే సొంతం. ఇంకా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పార్టీలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని భగ్నం చేయనున్నట్టు తెలిపారు. ఏది ఏమైనా అమెరికాలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు అతి దారుణంగా నమోదవుతున్నాయి. ఇంకా అలాంటి ఈ సమయంలో ఇలాంటి పార్టీలు పెట్టడం మాములు విషయం కాదు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: