ఇటీవల హైకోర్టు వరుసగా తెలంగాణ ప్రభుత్వం పై మొట్టికాయలు వేస్తూనే ఉంది. తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అనేక మార్లు విమర్శలు చేయడం హెచ్చరికలు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా హైకోర్టు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆన్లైన్ క్లాసుల విషయంలో కేసీఆర్ సర్కార్ కి లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్టుగా గట్టి స్ట్రోక్ వచ్చింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహణపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. అసలు విద్యా సంవత్సరం మొదలు కాకుండానే ఆన్లైన్ తరగతులు ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించింది. పాఠశాలలకు అనుమతులు ఇవ్వలేదు అని చెబుతున్న ప్రభుత్వం మరి ఎందుకు అడ్డుకోలేదు అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

IHG

ఇదే టైమ్ లో మహారాష్ట్ర మాదిరిగా ఆన్లైన్ క్లాసుల విషయంలో స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. మహమ్మారి కరోనా వైరస్ రావడంతో ప్రపంచ మానవాళి జీవితమే స్పందించినప్పుడు ఆన్లైన్ క్లాసులు నిర్వహణ పై స్పష్టమైన విధానాన్ని ఎందుకు ప్రకటించలేదని న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒకే ఇంటిలో రెండు, మూడు ల్యాప్ టాప్ లు ఉండే పరిస్థితి ఉందా అని ప్రశ్నించింది.

IHG

ఏసీ గదుల్లో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ప్రభుత్వానికి చురకలు అంటించింది. దీంతో ఈ విషయంలో ఏజి కలుగజేసుకొని త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని న్యాయస్థానానికి చెప్పుకొచ్చారు. కాగా జూలై 13 వ తారీకు లోపు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ఆన్లైన్ క్లాసుల విషయంలో తెలియజేయాలని కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: