ఈనెల 22వ తేదీన ఏపీ కేబినెట్ విస్తరణ జరగబోతు,న్న నేపథ్యంలో వైసీపీలో సందడి వాతావరణంతో పాటు ,టెన్షన్ కూడా కనిపిస్తోంది. ఈ విస్తరణ లో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు రాజీనామా చేయబోతున్నాఋ. ఈ విధంగా ఏర్పడబోయే ఖాళీలను భర్తీ చేయడం తో పాటు, ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రులను తప్పించి, వారి స్థానంలో మరో ఇద్దరిని తీసుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో వైసీపీలో ఉంది. అయితే రాజీనామా చేయబోతున్న మోపిదేవి, పిల్లి కాకుండా, మిగతా ఇద్దరు మంత్రులు ఎవరా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

IHG

 

ఈ నేపథ్యంలో, విశాఖ జిల్లాకు చెందిన బలమైన నాయకుడు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు, విజయనగరం జిల్లా కు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పై వేటుపడబోతున్నట్టుగా వైసీపీ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరికి సంబంధించి రిపోర్టులు జగన్ కు అందడం, వీరిద్దరు పనితీరు సక్రమంగా లేదని, పార్టీకి ఆశించినంత స్థాయిలో మైలేజ్ తీసుకురావడంలో విఫలమవుతున్నారనే జగన్ కు రిపోర్టులు అందాయట. ముఖ్యంగా విశాఖకు చెందిన అవంతి శ్రీనివాస్, జగన్ క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా వైసీపీ ప్రభుత్వం విశాఖలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని సుధాకర్ తో పాటు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నా, అవంతి వారిని కట్టడి చేయలేక పోయారని జగన్ ఆగ్రహంగా ఉన్నారట. ఇక విజయనగరం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరించలేకపోతున్నారు అని, ఉత్తరాంధ్రలో 6 గిరిజన అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

 

IHG

 

ఈ ఆరు వైసీపీ ఖాతాలో పడినా, అటువంటి చోట పార్టీని మరింత పటిష్టం చేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నా, ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదని, ఎక్కువగా కురుపాం కి పరిమితం అవుతుండడంతో పాటు, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించడం లేదని, ఆ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నా, ఆయనను అందుకునేందుకు పుష్ప శ్రీ వాణి ప్రయత్నించలేకపోవడం ఇవన్నీ జగన్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వైసీపీ లో ప్రచారం జరుగుతోంది.. వీరిద్దరిపైనా  వేటు తప్పదనే ప్రచారం వైసీపీలో ఊపందుకుంది. మరి జగన్ వీరి విషయంలో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: