చైనా వారికి చెందిన యాప్స్ ను పదుల సంఖ్యలో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన వారికే చెందిన మొబైల్ వీడియో గేమ్ అయిన పబ్‌జి ను మాత్రం ప్రభుత్వం నిషేధించలేదు. గేమ్ వల్ల పలువురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సందర్భాలు కూడా మనం చూశాం. అయితే పంజాబ్ లో యువకుడు మాత్రం పబ్‌జి పిచ్చిలో పడి ఏకంగా తన తండ్రి బ్యాంక్ అకౌంట్ నుండి 16 లక్షలు ఖర్చు చేశాడు. యువకుడి తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగరీత్యా వేరే దగ్గర ఉంటున్నాడు. ఆన్లైన్ క్లాస్ అని చెప్పి యువకుడు తన తల్లి స్మార్ట్ ఫోన్ తీసుకొని ఆడేవాడు.

 

అలా.... అలా..... యువకుడు పబ్‌జి గేమ్ కు బానిస అయిపోయాడు. అయితే గేమ్ ను ఫ్రీ గానే ఆడుకోవచ్చు కానీ అందులో అసలైన మజా మరియు అందరి కన్నా కొద్దిగా పైచేయి సాధించాలంటే ఆటలో పలు రకాల ఐటమ్స్ డబ్బులు పెట్టి కొనవచ్చు. అందుకుగాను యాప్ లో కొనుగోలుకు సౌకర్యం కల్పించారు. ఫ్రీ ప్లేయర్లకు అందుబాటులో లేని సర్వీసులు, ఫీచర్లు డబ్బులు కట్టే ప్లేయర్లకు లభిస్తాయి. అందుకని అతనికి తన తండ్రి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసు కనుక గేమ్ లో చాలా వస్తువులు డబ్బులు పెట్టికొనేవాడు. అంతే కాకుండా తన టీం సభ్యులకు కూడా అయ్యగారే స్పాన్సర్ చేయడం మొదలుపెట్టాడు. అలా క్రమంగా ఇప్పటి వరకు మొత్తం 16 లక్షల వరకు అతని ఇంట్లో వారి డబ్బులను కాజేశాడు.

 

పాపం యువకుడి తండ్రి దాచుకున్న తన జీవితకాలం సేవింగ్స్ ను అతని కుమారుడు గేమ్ కోసమే ఖర్చు పెట్టాడు. ఇక బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు మెసేజ్ లు తన తల్లి మొబైల్ కు వచ్చినప్పుడల్లా అతను మెసేజ్ లను తన తల్లికి కనబడకుండా డిలీట్ చేసే వాడు. చివరికి బ్యాంకు వారు నెల మారడంతో స్టేట్మెంట్ పంపడంతో అది చూసి యువకుడి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. చివరికి తమ కుమారుడే ఒక మొబైల్ గేమ్ లో గెలిచేందుకు ఇంత మొత్తం ఖర్చు చేశాడు అని తెలియడంతో వాపోతున్నారు.

 

ఇక విషయం పై పోలీసు వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో ఫార్మాలిటీ కేసు రాసుకున్నారు కానీ టెక్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం యువకుడు తనకు తెలిసే డబ్బు మొత్తం ఖర్చు పెట్టాడు కాబట్టి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేవు. ఇక అందుకు శిక్షగా మరియు యువకుడికి డబ్బు విలువ తెలిసి రావాలని తండ్రి అతనిని ప్రస్తుతానికి ఒక మెకానిక్ షాపులో పనికి చేర్పించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: