తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మచిలీపట్నం వైకాపా పార్టీకి చెందిన మోకా భాస్కరరావు హత్య విషయములో దొరికిన నిందితులు కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలం ఇవ్వటంతో మచిలీపట్నం పోలీసులు కొల్లు రవీంద్ర ఇంటికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా ఆయన లేకపోవడం జరిగింది. దీంతో మూడు బృందాలుగా మచిలీపట్నం పోలీసులు విడిపోయి కొల్లు రవీంద్ర పట్టుకోవాలని గాలింపు చర్యలు చేపట్టగా విశాఖపట్నం వెళ్తూ తుని దగ్గర దొరికిపోయారు.

IHG

ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హైలైట్ గా మారింది. ఈ నేపథ్యంలో రవీంద్రను పోలీసులు అరెస్టు చేయడం అమానుషమని చంద్రబాబు పేర్కొన్నారు. కనీసం ఎలాంటి విచారణ చేపట్టాకుండా కొల్లు ను అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. ఇది వైసీపీ పార్టీ కక్ష సాధింపు చర్యకు నిదర్శనమని మండిపడ్డారు. బీసీల మీద కక్ష సాధింపు తోనే ఈ కేసులో రవీంద్రను ప్రభుత్వం ఇరికించిందని చంద్రబాబు ఆరోపించారు.

IHG's murder

దేశంలో ఎమర్జెన్సీ నిర్వహించిన టైం లో కూడా ఇలాంటి అరాచకాలు జరగలేదని కానీ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలోనే ఇన్ని దారుణమైన అరాచకాలు జరుగుతున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలను ఇంత దారుణంగా టార్గెట్ చేయడం మంచిది కాదని...ముఖ్యంగా బీసీల పైన వైసీపీ ప్రభుత్వం పగబట్టిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. . అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలని చంద్రబాబు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: