లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో వారికి గట్టిగానే బదులు ఇచ్చేందుకు భారత్ సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకస్మికంగా లడఖ్ లో పర్యటించారు. అసలు కరోనా సమయంలో ప్రధాని చైనా సరిగద్దు ప్రాంతానికి ఇంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది ఇక్కడి ప్రశ్న. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న చైనాతో యుద్ధ నెలకొన్న వాతావరణం పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల (యాప్స్ నిషేధం) ఆధారంగా చైనీయుల వారి నుండి కచ్చితంగా మనకు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే చెప్పేశాయట.

 

ఇక యాప్స్ అన్నీ నిషేధించడం మరియు వారికి అప్పగించిన కాంట్రాక్టులను రద్దు చేసుకోవడంతో వారికి కొన్ని వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఇక దానికి పర్యవసనాలనుగా భరించేందుకు చైనీయులు రెడీగా ఉండాల్సిందే. అయితే సీనికి ప్రతీకారంగా భారత్ పై దాడులకు పాల్పడేందుకు వారి సన్నాహాలు జరుపుతున్నారని ఆర్మీ కి సమాచారం వచ్చిందని అందుకే ఘర్షణలు జరిగిన చోటు నుండి 250 కిలోమీటర్ల దూరంలోనే సైనికులు మోదీని ఆపివేసి అక్కడే ఆయనతో సమావేశమయ్యారని చెబుతున్నారు.

 

క్రమంలోనే చైనావారి దాడులను తిప్పి కొట్టేందుకు మరియు సైనికులకు అవసరమైన పూర్తి సహకారాన్ని తెలిపేందుకు మోదీ అక్కడికి హుటాహుటిన వెళ్ళినట్లు సమాచారం. క్రమంలోనే ఆయన 14 కార్ప్స్ లెఫ్టినెంట్ కమాండర్ తో లేహ్ చేరుకుని 14 కార్ప్స్ సైన్యాధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. టీమ్ అంతా బాగా బాగా యుద్ధ నైపుణ్యత కలిగిన వారు కావడమేకాకుండా వీరిని సరిహద్దుల్లో గస్తీకి నియమించారు.

 

పుల్వామా దాడి జరిగిన తర్వాత భారత సైనికులను మట్టుబెట్టిన పాక్ వారిని అంతమొందించేందుకు సరిహద్దు లోకి వెళ్లి అందుకు కారణమైన వారిని ఏరిపారేసిన తీరును సమావేశం గుర్తు చేస్తోందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడైనా ఆదేశాలు వస్తాయన్న దృక్పథంతో వారు ఉన్నారని మరియు తమ సహచరుల చావుకి ప్రతీకారేచ్చ తో రగిలిపోతున్నారట. సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణెలతో కలిసి లేహ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

అంతే కాకుండా త్రివిధ దళాధిపతులతో.. ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ వాయుసేన చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా భేటీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది అత్యున్నత స్థాయి సమావేశంగా భావిస్తున్నారు. సరిహద్దులో తదుపరి చర్యల కోసం సమావేశం నిర్వహించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: