కరోనా.. ఈ మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా మాయమవుతున్నాయి. కరోనాతో మరణించిన వారికి కనీస లాంఛనాలు కూడా దక్కడం లేదు. వారి మృత దేహాలను దారుణంగా సమాధుల గోతుల్లో విసిరేస్తున్న దృశ్యాలు మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్నాయి. కరోనాతో మరణిస్తే అది కుక్క చావేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడుతోంది.

 

 

అయితే విచిత్రమైన విషయం ఏంటంటే.. మృత దేహాల వల్ల కరోనా వ్యాపించేందుకు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయట. అంతే కాదు.. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని మృతదేహంలో కరోనా కేవలం ఆరు గంటల పాటు మాత్రమే బతికి ఉంటుందట. ఆరు గంటల తర్వాత ఆ మృత దేహాల నుంచి కరోనా వ్యాపించడం జరగదట. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడించారు.

 

 

ఇటీవల చాలా చోట్ల కరోనా మృతుల డెడ్ బాడీలకు దహన సంస్కారాలను కూడా స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ప్రాంతంలో అంత్యక్రియలు చేయవద్దని ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలియకుండా ఇలా చేయడం మంచిది కాదని జవహర్ రెడ్డి సూచిస్తున్నారు.

 

 

వైరస్‌తో మృతి చెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకుని ఇబ్బందులు కలుగజేయొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. సో.. ఇకనైనా కరోనా మృతులకు కనీస గౌరవాలతో అంత్యక్రియలు జరుగుతాయని ఆశిద్దాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: