భారత్ చైనా వివాదం అంతకంతకూ ముదురుతోంది. భారత్ చైనా యాప్ లపై నిషేధం విధించటంతో ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దేశంలోని పలు ప్రాజెక్టుల్లో సైతం చైనా కంపెనీలకు అనుమతి లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో ఇరు దేశాల మధ్య పలు ప్రాజెక్టుల విషయంలో జరిగిన ఒప్పందాలను సైతం కేంద్రం రద్దు చేసుకుంటోంది. నిన్న ప్రధాని మోదీ లడఖ్ పర్యటనతో చైనా ఒక్కసారిగా షాక్ కు గురైంది. 
 
మోదీ లద్దాఖ్ పర్యటనతో చైనా అధికారుల వెన్నులో వణుకు పుట్టింది. చైనా విదేశాంగ శాఖ ప్రధాని పర్యటనపై స్పందిస్తూ అసంతృప్తికి వెళ్లగక్కింది. భారత్ చైనా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను తగ్గించటానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ మాట్లాడుతూ పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవ్వరూ పాల్గొనకూడదని ప్రకటన చేశారు. 
 
సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతున్న సమయంలో తీవ్రత పెంచే వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. గల్వాన్ ఘర్షణల అనంతరం నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరపడానికి మోదీ లడఖ్ ఆకస్మిక పర్యటన చేపట్టారు. వాస్తవానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు హాజరు కావాల్సి ఉంది. కానీ ప్రధాని మోదీనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. చైనా వెన్నులో వణుకుపుట్టడంతో డ్రాగన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తోంది. 
 
మోదీ వాస్తవాధీన రేఖ దగ్గర నెలకొన్న పరిస్థితుల గురించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం నరవణేలు పాల్గొన్నారు. మరోవైపు ఇప్పటికే చైనాకు పలు షాకులు ఇచ్చిన భారత్ మరిన్ని షాకులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. చైనా వస్తువుల విషయంలో భారత్ కఠినంగా వ్యవహరించనుందని సమాచారం అందుతోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: