కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా భారీన పడ్డారు. తాజాగా ఆయన వంటింటి చిట్కాలు పాటించి ఐదు రోజుల్లో కరోనా నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు. నిన్న ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ గత నెల 25న గన్ మెన్ కు, తర్వాత అటెండర్ కు, తర్వాత పేషీలో 11 మందికి కరోనా సోకిందని తెలిపారు. 
 
దీంతో తాను ఆస్పత్రిలో చేరానని.... తర్వాత కరోనా నిర్ధారణ కావడంతో మందులు వేసుకోవడంతో పాటు తులసి ఆకులు వేసిన నీళ్లను రోజుకు నాలుగైదు సార్లు తాగానని చెప్పారు. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టానని..... ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి సమయంలో ఉడకబెట్టిన గుడ్డు తిన్నానని అన్నారు. నల్ల మిరియాలు వేసుకుని తిన్నానని.... వేడిగా ఉండే ఆహార పదార్థాలు, వేడినీళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. 
 
అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నానని తెలిపారు. ఉప్పు వేసిన నీటిని పుక్కలించడం ద్వారా గొంతులో ఇన్ ఫెక్షన్ తగ్గిందని తెలిపారు. పసుపు వేసిన పాలు రోజూ రాత్రిపూట తాగేవాడినని చెప్పారు. రోజూ ఉదయం యోగాతో పాటు ఊపిరితిత్తులకు మేలు చేసే వ్యాయామాలు చేశానని తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో ఎనిమిది మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోన కేసుల సంఖ్య 20,000 దాటగా మృతుల సంఖ్య 283కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,984 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: