కేంద్ర అధికార పార్టీ బిజెపి ఏపీ అధికార పార్టీ వైసీపీ మధ్య ఉన్నది స్నేహమా, శతృత్వమా అనేది ఎవరికి క్లారిటీ లేదు. కనీసం ఈ రెండు పార్టీల నాయకులకు ఈ విషయంలో స్పష్టత లేదు. ఏపీ బీజేపీ నాయకులు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, విమర్శలు చేస్తుంటే, బీజేపీ అగ్రనేతలు మాత్రం జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ, ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. దీంతో అసలు బిజెపి వైసిపి ల మధ్య బంధం ఏంటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఉన్నది స్నేహమా లేక వైరామా అనేది స్పష్టత వచ్చే సమయం వచ్చేసింది. ప్రస్తుతం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

 

రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరాలనే ఆశతో ఉన్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయించి, తమ పార్టీలో అసమ్మతి లేకుండా చేసుకోవాలని వైసిపి అధినాయకత్వం భావిస్తోంది. అలాగే ఇప్పటికే రఘురామకృష్ణంరాజు కాస్త వెనక్కి తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నా, వైసిపి మాత్రం ఆయన వ్యవహారంలో సీరియస్ గానే వ్యవహరించాలని చూస్తోంది. అందుకే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి మరి ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

 

అలాగే ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వైసీపీ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పేరు ఎలా వాడుకుంటుంది అని, అది తమ పార్టీ కాదు అంటూ ఎన్నికల సంఘంను కూడా కలిశారు. ఈ సమయంలో కేంద్రం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ? ఎవరి పక్షాన నిలబడుతుంది అనే విషయం క్లారిటీ వస్తే బీజేపీ వైసీపీ ల మధ్య ఉన్న సంబంధం ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: