అల్లూరి సీతారామరాజు. ఈ పేరు చెప్పగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎక్కడలేని ఉత్తేజమూ వస్తుంది. ఆయన సరిగ్గా 27 ఏళ్ళు మాత్రమే జీవించాడు. తన జీవితమంతా పోరాటమే చేశాడు. అది కూడా సాయుధ పోరాటం. ఆనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తనకున్న పరిమితమైన సాయుధ బలంతో ముప్పతిప్పలు పెట్టాడు, మూడు చెరువుల నీళ్ళు తాగించాడు.

IHG

రెండేళ్ళ పాటు అల్లూరి చేసిన వీరోచిత పోరాటం సెగ ఢిల్లీ దాకా సాగింది. ఆతన్ని ఎలాగైనా మట్టుపెట్టాలని బ్రిటిష్ సేనలు దుర్మార్గపు ఎత్తులు వేశాయి. గిరిజినుల గుండెల్లో కొలువైన రాజును ఆ గిరిజనులనే ఎరగా వేసి రప్పించాయి. గిరిజనులను ఊచకోత కోస్తామంటూ బ్రిటిష్ సైన్యం చేసిన దారుణమైన బెదిరింపుతో రాజు తన గిరిజనులకు ఏ కీడు జరగకూడదని తనుకు తానుగా సమాచారం ఇచ్చి తెల్లదొరలకు దొరికినట్లుగా చేసుకున్నాడు.

IHG

ఇంత చేసినా కిరాతకమైన విధానాల్లోనే నాడు తెల్లదొరలు రాజుని మట్టుపెట్టారు. ఎటువంటి  విచారణాలేదు, ఇదేమని ప్రశ్నించనూలేదు, ఏకంగా ఒక చెట్టుకు కట్టేసి ఆయన మీద తూటాలు ప్రయోగించారు. ఆ తరువాత ఆయన భౌతిక కాయానికి ఫోటో తీసి ఆయన కుటుంబీకులకు పంపించారు.మొత్తానికి రాజుని పట్టుకోలేక, ఆయన యుధ్ధ నీతిని ఎదిరించలేక, దొంగ దారిన, దొడ్డిదారినే బ్రిటిష్ అధికారులు మట్టుపెట్టారు.

IHG

విశాఖ మన్యంలో 1922 నుంచి 1924 వరకూ రెండేళ్ళ పాటు గిరిజనుల కోసం అల్లూరి చేసిన పోరాటాం అజారామరం. అల్లూరికి సాటి అయిన నేత మరోకరులేరు. ఆయన సింహ గర్జన విశాఖ గిరి సీమల్లో నేటికీ ప్రతిద్వనిస్తూనే ఉంటుంది. అటువంటి విప్లవాగ్ని పుట్టింది 1897 జులై 4వ తేదీన, మరణించింది. 1924 మే 7న. ఈ రోజు అల్లూరి జయంతి. ఆ వీర జ్యోతిని స్మరించుకోవడం భారతీయుల కనీస కర్తవ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: