రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా జోరు పెంచేసింది. రోజు రోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే.. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత కరోనా బాగా వ్యాపిస్తోంది. అయితే కొందరి వల్ల ఈ కరోనా వ్యాప్తి మరీ ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు అమ్మేవారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

 

 

ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి వివరించారు. కరోనా వ్యాప్తికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయం చేసేందుకు వివిధ కేటగిరీలుగా విభజించి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన మీడియాకు వివరించారు. బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, నిర్మాణ రంగం, వ్యవసాయ కూలీలు, కూరగాయలు విక్రయించేవారికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారట.

 

 

వారితో పాటు పరిశ్రమల్లోని కార్మికులు, మార్కెట్‌ యార్డులు, ఆరోగ్య తదితర రంగాల్లో పని చేసేవారికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక కరోనా బారిన పడిన వారిలో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృతి చెందుతున్నారని అధికారులు చెబుతున్నారు.

 

 

ఇక ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్‌తో 9,096 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న 600 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అధికారులు వెయ్యికి పైగా శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కువగా.. వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: