ఎక్కడో చైనాలోని వూహన్‌లో పుట్టి, ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా రోగులను సంపాదించుకుంటున్న వైరస్ కరోనా.. దీనికి కూడా మనుషులకు ఉన్నట్లే తెలివి ఉందనుకుంటా. అందుకే రకరకాలుగా మార్పులు చెందుతూ మానవాళిని మోసం చేస్తుంది.. ఇక మనుషులమైన మనం మోసాలు చేసి బ్రతకడంలో ఎప్పుడో ఆరితేరాము. కానీ మనల్ని ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేము.. అందుకే కరోనా వచ్చింది.. ప్రపంచాన్ని ఒక ఆట ఆడిస్తుంది..

 

 

ఇకపోతే ఈ వైరస్ క్రమక్రమంగా తన జన్యుక్రమంలో మార్పులు చేసుకుంటుందట.. దీంతో వైరస్‌లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్ధ్యం కూడా పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుందని వీరు తెలుపుతున్నారు.. ఇక కొవిడ్‌ జాతికే చెందిన కోవ్‌-2 వైరస్‌లో ‘డీ614జీ’ అనే కొత్త రకం వచ్చి చేరిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.. వారు చేసిన పరిశోధనల్లో ఇది ఎక్కువగా ఒకరి నుండి ఒకరికి సంక్రమించే లక్షణాలు ఉన్నాయని తేలగా, ఈ రకం వైరస్ ఏప్రిల్‌లోనే ‌శాస్త్రవేత్తల దృష్టికి వచ్చిందన్నారు..

 

 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా అధికంగా వ్యాప్తి చెందుతున్న దశలో ‘డీ614జీ’ చేరడంతో పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.. ఇక శాస్త్రవేత్త బెటె కోర్బర్‌ మాట్లాడుతూ, ఈ వైరస్‌ తన ఆకృతి సాయంతో మానవ కణాల్లోకి అధికంగా ప్రవేశిస్తుందని తెలిపారు.. ఇకపోతే ఈ కరోనా ఒంటరిది ఏం కాదట.. దీనికి ఒక ఫ్యామిలీ ఉందట.. ఆ ఫ్యామిలీలో ఎన్నో వైరస్‌లు ఉండగా అందులో ఏడు మాత్రమే మనుషులకు సోకుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

 

 

ముఖ్యంగా ఆల్ఫా, బీటాలే మనిషికి సోకేవని నిర్ధారించారు.. కాబట్టి ఇప్పుడే కాదు ఇక ముందు కూడా మానవ జీవన విధానంలో మార్పులు చేసుకుని తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉండగలరని తెలుపుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: