వాళ్లంతా రాజకీయ నాయకులు.. జనం కంటే తెలివైన వాళ్లు.. జనానికి నీతులు చెప్పాల్సిన వాళ్లు.. కానీ కరోనా రక్కసి మాత్రం నాకు ఎవరైనా ఒకటే అంటోంది. అందుకే ఇప్పుడు కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బారిన పడుతున్న నాయకుల జాబితా పెరిగిపోతోంది.

 

 

నాయకులు.. అంటే జనంలో ఉంటారు. జనం కోసం తిరుగుతుంటారు. మరి వీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. జనంలోకి వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఏమో కానీ చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ నలుగురు ఎమ్మెల్యేలు, మంత్రి కరోనా బారిన పడ్డారు.

 

 

ఉప ముఖ్యమంత్రి అలీ కరోనా బారిన పడి మళ్లీ కోలుకున్నారు కూడా. ఇక కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు కూడా కరోనా బారిన పడి బాగానే కోలుకున్నారు. ఇంకా పద్మారావు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు ఏపీలోనూ మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు.. వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం ఆయనే ఓ వీడియో ద్వారా ప్రకటించారు కూడా.

 

 

ఇక అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి కూడా కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో నాయకులు కాస్త జాగ్రత్త పడుతున్నారు. తగిన జాగ్రత్తలతోనే ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. అయితే కరోనా బారిన పడుతున్నా త్వరగానే కోలుకోవడం ఉరటనిచ్చే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: