ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్ డిపో లో నిలిపి ఉంచిన బస్సుని లారీ డ్రైవర్ సత్యనారాయణ ఎత్తుకెళ్లాడు . ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. అయితే యజమాని ఫిర్యాదు చేయడం తో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఆర్టీసీ అద్దె బస్సు అపహరణకు గురి కావడం తో తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం పట్టణానికి చెందిన శీలం మల్లయ్య సత్తుపల్లి ఆర్టిసి డిపో లో ఎక్స్ప్రెస్ బస్సు ను అద్దెకు తీసుకుని దానిని నడుపుతున్నాడు . అయితే గురువారం రాత్రి బస్టాండ్ ప్రాంగణం లో నిలిపి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం చూస్తే బస్సు కనిపించ లేదు దీని పై బస్సు యజమాని సత్తుపల్లి పోలీసులు ఫిర్యాదు చేశాడు .

 

అయితే కేసు నమోదు చేసి పోలీసులు  విచారణ చేశారు. దానిలో తేలిందేమిటంటే సత్యనారాయణ అనే లారీ డ్రైవర్ ఈ బస్సును  ఎత్తుకెళ్లి పోయినట్లు పోలీసులు గుర్తించారు . ఇది ఇలా ఉండగా చెరుకు పల్లి అడవి ప్రాంతం లో బస్సుతో పాటు నిందితుడిని పట్టుకుని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి  తరలించారు . అయితే ఇక్కడే పోలీసులు గమనించిన మరో చిక్కు ఏమిటంటే ఎత్తుకు వెళ్ళిపోయిన సత్య నారాయణకు కరోనా లక్షణాలు ఉన్నట్లు, అతను  కరోనా  లక్షణాల తో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఇలా జరగడం తో సత్తుపల్లి పోలీసులు కూడా కలవర పడ్డారు  అనే చెప్పాలి .

 

 వెంటనే అతన్ని సత్తుపల్లి సి హెచ్  సి  కి తరలించారు. సాధారణ పరీక్షలు అతడికి నిర్వహించిన తర్వాత అతన్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ లో ఐసోలేషన్ వార్డు లో ఉంచారు . బస్సు ఎత్తుకెళ్లి పోయిన లారీ డ్రైవర్ కి కరోనా లక్షణాలు ఉండడం పోలీసులు ని కలవర పరిచింది . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: