ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. అసలు క‌రోనా దెబ్బ‌తో ఎవ‌రు ఎప్ప‌టి వ‌ర‌కు బ‌తికి ఉంటార‌న్న‌ది కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అస‌లు ప్ర‌పంచంలో కొన్ని కోట్ల మందికి తిన‌డానికి తిండి కూడా లేదు. కొన్ని కోట్ల మందికి ఉపాధి లేదు. ఇలాంటి టైంలో కూడా తెలంగాణ‌లో మంద‌బాబులు తెగ తాగేస్తున్నారు. ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా మ‌న దేశంలో మందుబాబులు రోజుకు ఏకంగా రు. 68 కోట్ల మందూ ఊదేస్తున్నార‌ట‌.

 

జూన్ నెల‌లో ఎక్కువ మంది మందు తాగ‌క‌పోయినా.. బీర్లు మాత్రం ఎక్కువ లాగించేశార‌ట‌. మొత్తంగా రెండు నెలల్లో కలిపి రూ. 3 వేల కోట్ల వరకు ఖజానాకు కాసుల పంట పండిందని తెలుస్తోంది. లాక్ డౌన్ విధించిన త‌ర్వాత మే నెల 6వ తేదీ నుంచి ఇక్క‌డ‌ మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభ మ‌య్యాయి. ఈ నెల‌లోనే ఏకంగా రు. 1864 కోట్ల మందు అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు రోజుకు స‌గ‌టున 1000 క్రాస్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ లాక్ డౌన్ ఉంటుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ మ‌ద్యం అమ్మ‌కాలు జోరందుకున్నాయి. 

 

ఇక మే, జూన్ నెల‌ల్లో మందు అమ్మ‌కాల ద్వారా ఏకంగా రు. 3 వేల కోట్ల ఆదాయం ప్ర‌భుత్వానికి వ‌చ్చింద‌ని లెక్క‌లు చెపుతున్నాయి. ఈ లెక్క‌లు చూస్తుంటే లాక్ డౌన్ ఉంటేనే తెలంగాణ‌లో ఈ రేంజ్ లో మ‌ద్యం అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయంటే.. ఇక లాక్ డౌన్ లేక‌పోతే ప‌రిస్థితి ఏ రేంజులో ఉంటుంది ?  తెలంగాణ‌లో వీర తాగుబోతులు ఏ రేంజ్‌లో మ‌ద్యాన్ని ఊదేస్తారో ? అర్థం చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: