దేశంలో కరోనా  వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇక రోజురోజుకు ఈ మహమ్మారి రక్కసి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ప్రజలందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది ఈ వైరస్. కరోనా సంక్షోభంలో డాక్టర్లు ప్రజల ని కాపాడేందుకు ప్రత్యక్షంగా ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా  తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది డాక్టర్లు ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువాత పడుతున్నారు. 

 

 ఇలా ఇప్పటికే ఎంతో మంది వైద్యులు కూడా విధినిర్వహణలో నిమగ్నమై కరోనా  పేషెంట్లకు వైద్యం అందించి చివరికి తమ ప్రాణాలను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే తాజాగా ఢిల్లీలో ఓ డాక్టర్ మృతి చెందారు. అయితే సదరు వైద్యునికి రెండుసార్లు కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించినప్పటికీ రెండుసార్లు కూడా నెగెటివ్ అని వచ్చింది. కానీ సదరు డాక్టర్ చనిపోయే ముందు మాత్రం ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర కరోనా లక్షణాలు కనిపించాయని ఆ డాక్టర్ సోదరుడు వెల్లడించారు, ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 

 

 దేశ రాజధాని ఢిల్లీలో మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంటల్ సైన్సెస్ లో ఓరల్  సర్జరీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ అభిషేక్ పనిచేస్తున్నాడు, ఎయిమ్స్  ఎండిఎస్  పరీక్షల్లో  జాతీయ స్థాయిలో 21 వ ర్యాంక్  సాధించిన అభిషేక్.. జూన్ నెలలో హర్యానాలోని రోహ్తక్  కు వెళ్లి వచ్చాడు. అయితే ఈ వైద్యుడి లో కరోనా  వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ రెండుసార్లు కరోనా  పరీక్షలు నిర్వహించిన నెగిటివ్ అని మాత్రమే వచ్చింది. కానీ ఈ డాక్టర్ చనిపోయే ముందు మాత్రం చాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి కరోనా  లక్షణాలతోనే మరణించాడు. 

 


 అంతేకాదు తన చివరి మాటలో తాను శ్వాస తీసుకోలేక పోతున్నానని ఇవన్నీ కరోనా  లక్షణాలు అంటూ నేను కచ్చితంగా చెప్పగలను అంటూ డాక్టర్ అభిషేక్ చివరి మాటలు చెప్పినట్లు అతని సోదరుడు పేర్కొన్నాడు, వైద్యుడు అభిషేక్ మరణాన్ని మెయిడ్స్  కు చెందిన ఓ సీనియర్ డాక్టర్ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఏదేమైనా ఈ డాక్టర్ మరణం మాత్రం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: