దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి వల్ల ప్రజలు విలవిల్లాడుతుంటే మరోవైపు నేరగాళ్లు మాత్రం వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి సమయాల్లో కూడా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విపత్కర సమయంలో కూడా మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఏదొక రకంగా మహిళలపై అత్యాచారాలు చేయాలి అనుకోని కొంతమంది పధకం ప్రకారం వారిని ఉచ్చులో దించుతున్నారు.


తెలిసిన వాళ్లే ఇలా చేయడంతో వారు బయటకు చెప్పలేక భయపడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఛత్తీస్ గడ్ లో జరిగింది. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు కొవిడ్ -19 పాజిటివ్ అని చెప్పి, ఈ వైరసను నయం చేయడానికి తాము సమీపంలోని ఆసుపత్రి నుంచి మందులు ఇప్పిస్తామని నమ్మించిన ఇద్దరు బాలురు ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి అత్యాచారం జరిపారని ఏఎస్పీ ప్రతిభాపాండే చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కరోనా వైరసను నయం చేసే మందులను ఆసుపత్రి నుంచి ఇప్పిస్తామని చెప్పి బాలికను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు  బాలికను బయటకి తీసుకెళ్లారు. తర్వాత ఓ నిర్మానుష ప్రాంతంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసారు.



తమ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు తన అక్కను కరోనా నివారణకు మందులు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి తీసుకువెళ్లారని బాలిక తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తనను బయటకు తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు తనపై అత్యాచారం చేసారని బాలిక తన ఇంట్లో తల్లిదండ్రులుకు చెప్పింది. అసలు విషయమ్ బయటపడటంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు ప్రకారం తాము పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిందితుల్లో ఓ బాలుడ్ని అరెస్టు చేశారు. మరో బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: