కరోనా వైరస్ వల్ల సామాజిక పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కరోనా మహమ్మారి వలన మనుషుల మధ్య అంటరానితనం అనేది కూడా పెరిపోతుంది. ఇక్కడ అంటరానితనం అంటే సామాజిక దూరం. ఎవరికైనా కరోనా పాజిటివ్  వచ్చిందని తేలియగానే చుట్టుపక్కల ఉన్నవాళ్లు వారిని సామాజికంగా దూరం పెడుతున్నారు. టివి ల్లోనూ ,పేపర్ లోనూ నిత్యం చెప్తున్నారు మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు అని. అయిన కొంతమంది వారిని వివక్షతకు గురిచేయడంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆసుపత్రికి వెళ్లి వచ్చారని వారికి కరోనా ఉందనే భయంతో తల్లికొడుకలను ఊరి చివరే అడ్డుకొని ఊర్లోకి రాకుండా బంధించిన ఘటన అందర్నీ కలచివేసింది.

 

 

కామారెడ్డి జిల్లాలో జంగంపల్లిలో సుధారాణి అనే మహిళ కుటుంబం నివశిస్తోంది. ఆమె కూతురుకి ఇటీవలే ప్రసవం అయ్యింది. ఆమెను చూడటానికి బాలింత తల్లి సుధారాణి, సోదరుడు రాకేశ్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆ తర్వాత చేసిన టెస్టులో శిశువుకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ తల్లీ కొడుకులను ఊరి బయటే నిలదీశారు. మీకు కరోనా ఉంది కాబట్టి మీరు ఊర్లోకి రావద్దు అని అడ్డుకున్నారు.అంతటితో ఆగకుండా గ్రామ శివారులో గల పాఠశాలలోని ఓ గదిలో ఉండాలని ఆదేశించారు. స్కూల్ నుంచి బయటకు రాకుండా చుట్టూ ముళ్ల కంచె వేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. కరోనా వచ్చింది అని అనుమలు ఉంటే మాకు కూడా పరీక్షలు చేయాలి గాని ఇలా అనగరికంగా వ్యవహరించడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా తమ గోడును ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ బాధను చెప్పుకుంటూ ఒక సెల్ఫీ వీడియో ను తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నిజంగా కరోనా వస్తే చనిపోతాము అనే భయం కంటే గ్రామస్తులు వేధింపులతోనే చనిపోయేలా ఉన్నామని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోజుల్లో కూడా ఇలా అనాగరికంగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: