క‌రోనా విషయంలో డ్రాగ‌న్‌పై నిప్పులు క‌క్కుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మ‌రోసారి ఆ దేశంపై విరుచుకుప‌డ్డారు. కరోనాను చైనా నుంచి వచ్చిన ప్లేగుగా అభివర్ణించారు. డ్రాగన్ తీరు వల్లే మహమ్మారి ప్రపంచమంతా సోకిందని ఫైర్ అయ్యారు ట్రంప్‌.

 

అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గంటకు గంటకు కేసుల సంఖ్య పెరుగుతోంది.  వైరస్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతూ ఉండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనాపై కోపం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ఇప్పటికే వైరస్‌ విషయంలో చైనాను టార్గెట్‌ చేసిన.. ఇప్పుడు ఆ విమర్శలకు మరింత పదును పెట్టారు.

 

చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్ మరోసారి కన్నెర్రజేశారు. కరోనా వైరస్‌ను చైనా నుంచి వచ్చిన ప్లేగుగా ట్రంప్ అభివర్ణించారు. ఎప్పటికీ జరగకూడదనుకున్న దానిని చైనా.. జరిగేలా చేసిందని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిన తర్వాత.. ఆ సిరా తడి ఆరకముందే వైరస్ బయటపడిందని మండిపడ్డారు. ప్రస్తుత ప‌రిస్థితికి కార‌ణం చైనానేనంటూ పున‌రుద్ఘ‌టించారు.

 

మరోవైపు అగ్ర‌రాజ్యంలో క‌రోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది.  ప్ర‌స్తుతం అక్క‌డ‌ 28ల‌క్ష‌లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. లక్షా 31 వేల మంది కరోనాకు బలయ్యారు.  రోజులు గ‌డిచే కొద్ది కొత్త ప్రాంతాల‌కు విస్త‌రిస్తోంది. రానున్న రోజుల్లో రోజుకు ల‌క్ష పాజిటివ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇలా వైరస్ కట్టడి చేయి దాటడంతో.. ట్రంప్ చైనాపై పదే పదే విమర్శలు చేస్తున్నారు.

 

అగ్రరాజ్యంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై అమెరికా అధ్యక్షుడికి చిర్రెత్తుకొస్తోంది. దీంతో సహనం కోల్పోయిన ట్రంప్ చైనాపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంతా డ్రాగన్ కంట్రీ వల్లే ఇంత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. అమెరికాలో పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో ఆయన సహనం కోల్పోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: