పబ్‌జీ...! మొదట్లో కాలక్షేపం కోసం, సరదా కోసం మొదలుపెట్టి... ఆ తర్వాత దీనికి ఎడిక్ట్ అయిపోతున్న వారికి కొదవే లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా పబ్‌జీ గేమ్‌కు బానిసలవుతున్నారు. కొందరు ఈ ఆటతో పరిసరాలను, కుటుంబాలను సైతం మరిచిపోతుంటే.. మరికొందరు పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. ఓ టినేజ్‌ కుర్రాడు అయితే ఏకంగా ఈ గేమ్‌ కోసం దొంగగా మారాడు. తన తండ్రి అకౌంట్‌ నుంచి ఏకంగా 16 లక్షలు ఖర్చు చేశాడు.

 

పబ్‌జీ గేమ్‌ ఉచ్చులో పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ గేమ్‌ కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. పబ్‌జీకి సంబంధించి ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల ఓ టీనేజర్ పబ్‌జీ కోసం తల్లిదండ్రులకు తెలియకుండా ఏకంగా 16లక్షలు ఖర్చు చేశాడు.  పంజాబ్‌లోని ఖరార్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

 

పంజాబ్‌లోని ఖరార్‌కి చెందిన ఓ బాలుడు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేవాడు. స్మార్ట్‌ఫోన్ తీసుకున్న ఆ కుర్రాడు ఆన్‌లైన్‌ క్లాసులు వినకుండా పబ్‌జీకి ఎడిక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే... పబ్‌జీ మొబైల్ అకౌంట్ అప్‌గ్రేడ్,ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా 16లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. పబ్‌జీలో తన టీమ్ మేట్స్‌కు కూడా అతనే డబ్బులు పెట్టి మొబైల్ అకౌంట్ అప్‌‌గ్రేడ్ చేయించాడు. 

 

తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతాల వివరాలన్నీ తెలుసుకుని.. ఆ డబ్బును పబ్‌జీ కోసం వాడాడు. అకౌంట్ నుంచి లావాదేవీలు జరిపినట్లుగా మెసేజ్ రాగానే వాటిని డిలీట్ చేసేవాడు. అలా చాలా రోజులు అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించలేదు. ఇటీవల బ్యాంకు స్టేట్‌మెంట్స్ పరిశీలించడంతో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసి షాక్ తిన్నారు. వైద్య అవసరాల కోసం దాచుకున్న డబ్బును ఇలా తగలేయంతో వాపోతున్నారు తల్లిదండ్రులు. భవిష్యత్తులో చదువు కోసం కూడా తమ కుమారుడికి ఫోన్‌ ఇచ్చేది లేదని తేల్చేశారు ఆ తల్లిదండ్రులు

 

మరింత సమాచారం తెలుసుకోండి: