గబ్బిలాల పేరు చెబితే ఇప్పుడు వెన్నుల్లో వణుకు పుడుతుంది.  ఎందుకంటే చైనావాళ్లు ఈ దిక్కుమాలిన గబ్బిలాలు తిని ప్రపంచానికి కరోనా వైరస్ సోకేలా చేశారని అంటున్నారు. చైనా ప్రజలకు గబ్బిలాలంటే మహాప్రీతి.. వాటిని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కూర, సూప్ గా చేస్తుంటా.. కస్టమర్లు లొట్టలేసుకుంటూ ఆరగిస్తుంటారు. అయితే కరోనాకు గబ్బిలాలు కారణమా కాదా అన్న విషయం పక్కన బెడితే ఈ గబ్బిలాలను మాత్రం మన దేశంలో శకునం అంటుంటారు. ప్రపంచంలోనే విచిత్రమైన జీవుల్లో ఒకటి గబ్బిలం. ఇవి చూడటానికి పక్షిలా కనిపించినా వాటికి పళ్లు, చెవులు ఉంటాయి. చీకట్లోనే అటూ ఇటూ ఎగురుతూ.. పగటిపూట చెట్లపై గడుపుతాయి. ఇవి పక్షుల వలే గుడ్లు పెట్టగలవు. అలాగే జంతువుల వలే పిల్లలను కనగలవు.

 

ఇన్ని రకాల ప్రత్యేకతలు ఒక్క గబ్బిలాల్లోనే కనిపిస్తాయి. ఏది ఏమైనా పురాణ కాలం నుంచి ఈ గబ్బిలాలకు ఓ ప్రత్యేక స్థానం మాత్రం ఉందని ఖచ్చితంగా చెప్పగలం. తాజాగా ఓ గబ్బిలం గురించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.  సాధారణంగా గబ్బిలాల ముఖాలా చాలా చిన్నవిగా ఉంటాయి.. కానీ ఈ గబ్బిలం ముఖం చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. పెద్ద పెద్ద కళ్లు, ముక్కు, పొడవైన మొఖాన్ని కలిగి ఉంది.  వింత ఆకారంలో ఉన్న దీన్ని చూసి జనం వణికిపోయారు.

ఈ గబ్బిలం చూడటానికి అచ్చం గెదెలా కనిపిస్తుందని అంటున్నారు.. నిజంగా ఇది గబ్బిలమేనా.. కొంపతీసి గెదే అని ఆశ్చర్యపోతున్నారు.  ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతుంది. గబ్బిలాల్లో ఈ రకమైన వాటిని బ్యూటికోఫెర్స్ ఎపాలెట్టెడ్ ఫ్రూట్ బ్యాట్  అని పిలుస్తారు. సాధారణ గబ్బిలాల కంటే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. మైదానాలు, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: