దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు బయటకు వెళ్లి జంగ్ ఫుడ్, పానిపూరి ఇతర ఐటమ్స్ తినడం చాలా వరకు మానివేశారు.  ఏవరు ఎలా చేశారో.. ఎవరికి కరోనా ఉందో అన్న భయాలు మొదలయ్యాయి. అంతే కాదు కొంతమంది హూటల్ యాజమనులకు.. అందులో పని చేసేవారికి కరోనా రావడం కూడా ఇందుకు కారణం.  ఇక దేశంలో పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.. దీన్ని కొన్ని ప్రాంతాల్లో గోల్ గప్ప అంటారు. తెలుగు రాష్ట్రాల్లో గప్ చుప్ అని అంటుంటారు.  ఇక గప్ చుప్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.. రసం వేసుకొని.. అందులో కాస్త బటానీ కలుపుకొని గప్ చుప్ గా తింటుంటే ఆ టేస్టే వేరు. కానీ ఈ మద్య కరోనా వచ్చినప్పటి నుంచి దీనికి చాలా మంది దూరమయ్యారు.

 

ఇటీవల అన్ లాక్ చేస్తూ వస్తున్నా బయటి తిండి తినడానికి చాలా మంది భయపడిపోతున్నారు. పరిశుభ్రత, చేతులతో తాకడం నేపథ్యంలో అంతా నోటికి తాళం వేసుకొని పానీపూరి ఎప్పుడు తింటామా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పానీ పూరి ప్రియులకు శుభవార్త.. భౌతిక దూరం పాటిస్తూ.. పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతులతో మీరు తీసుకునే యంత్రాలు తయారు అవుతున్నాయి. ఈ పానీపూరీ వెండింగ్‌ మెషీన్‌లో 20 రూపాయల నోటు పెట్టగానే. అది మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే గోల్‌గప్పా ప్రత్యక్షం అవుతుంది. దాన్ని తీసుకొని కావాల్సిన వాటర్ వేసుకొని నోట్లో పెట్టుకోవడమే.

 

దీని ద్వారా ఎలాంటి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండకపోగా.. శుభ్రతను కచ్చితంగా పాటించవచ్చని చెబుతున్నారు. ఇది మొత్తం పూర్తిగా టెక్నాలజీతో కూడుకొని ఉంది.. దీని ముడి సరుకు మిషన్ లో పెడితే చాలు పానీ పూరి ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. వాటిని మన చేత్తో తీసుకొని తినేయడమే తరువాయి.  ఈ యంత్రాన్ని అస్సాంకు చెందిన వ్యక్తి తయారు చేశాడు. సుమారు ఆరు నెలల పాటు కష్టపడి దీన్ని ఆవిష్కరించాడు. అతడు చేసిన పనికి పానీపూరీ ప్రియులు తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ మిషన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: