దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా విజృంభణ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో జూమ్ యాప్ కు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే జూమ్ కు పోటీగా రిలయన్స్ జియో "జియో మీట్" పేరుతో యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. 
 
ఈ యాప్ లోని ఫీచర్లు జూమ్ యాప్ కాపీ మాదిరిగా కనిపిస్తాయి. ఈ యాప్ 24 గంటల పాటు యూజర్లు ఉచితంగా మీటింగ్స్ కనెక్ట్ అయ్యేందుకు అనుమతి ఇస్తోంది. జియో ఈ యాప్ సేవలను వినియోగించుకోవడానికి ఎటువంటి నగదు వసూలు చేయదు. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల అడ్రస్ వివరాలను నమోదు చేసి ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు. జూమ్ యాప్ ఫ్లాట్ ఫాంలో గరిష్టంగా 40 నిమిషాల వరకు ఉచితంగా కనెక్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది. 
 
పాస్ వర్డ్ ప్రొటెక్టడ్ మీటింగ్ లింక్స్ ను కూడా ఈ యాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఇతర సభ్యులకు కంట్రోలింగ్ అబిలిటీ ఇవ్వవచ్చు. వర్చువల్ సమావేశాల కోసం ప్రత్నామ్యాయంగా భారత్ నుంచి జియో మీట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో 720 పిక్సెల్ విజువలైజేషన్ క్వాలిటీతో పాటు సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. జూమ్ కు ప్రత్యామ్నాయంగా భారత్ లో జియో మీట్ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
భారత్ చైనాకు సంబంధించిన 59 యాప్స్ ను నిషేధించిన సమయంలో జియో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ డివైజ్ ల్లో సపోర్ట్ చేస్తుంది. యూజర్ ఒకే సమయంలో 5 వేర్వేరు డివైజ్ ల్లో నుంచి లాగిన్ అవ్వొచ్చు. కాల్స్ మాట్లాడుతున్న సమయంలోనూ ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ మధ్య స్విచ్ చేయొచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: