తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతుండడంతో అంతకంతకు ప్రజల్లో  భయాందోళన పెరిగిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రజలందరికీ మహమ్మారి వైరస్ భయంతోనే బతుకును వెళ్లదీస్తున్నారు. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంతమందికి నిర్లక్ష్యం కారణంగా జాగ్రత్తలు తీసుకునేవారు కూడా కరోనా  వైరస్ బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. 

 

 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి దుస్థితి వచ్చింది అంటే.. కరోనా వైరస్ సోకిన వాళ్ళు హౌస్ ఐసొలేషన్ లో ఉండండి అని చెప్పేంత  స్థితి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా రోగులతో  రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలన్ని నిండిపోయాయి.. అటు  ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రస్తుతం కరోనా  రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ప్రస్తుతం కరోనా  వైరస్ సోకిన రోగులది. అదే సమయంలో కరోనా వైరస్ పరీక్షల విషయంలో కూడా తెలంగాణ సర్కారు అలసత్వంగా  వ్యవహరిస్తుంది అన్నది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా
 చర్చించుకుంటున్నారు. 

 

 అటు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా  వైరస్ పరీక్షలకు ఇప్పటికే ఎంతో మంది తరలి వెళ్తున్న సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు కూడా పరీక్షలు చేయించుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా ఏకంగా 13, 500  రూపాయలు వసూలు చేస్తున్నారని టాక్  కూడా ఉంది. కరోనా  చికిత్స కోసం  కూడా భారీగానే వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చితే బాగుండు అని కోరుకోని  తెలంగాణ పౌరుడు లేడు అనడంలో అతిశయోక్తి. ఆంధ్రాలో కరోనా  పరీక్షల చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చి సంచలన నిర్ణయం తీసుకుంటే తెలంగాణ సర్కారు మాత్రం అలాంటి నిర్ణయానికి మాత్రం పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: