ఒకప్పుడు ఎన్నారైలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఎంతగానో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. పర్ఫెక్ట్  ప్లానింగ్ తో వ్యూహాత్మకంగా పాలన సాగిస్తు దేశ ప్రజలందరికీ సమన్యాయం చేస్తున్నారు అంటూ గతంలో ఎన్నారైలు మోదీ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ప్రస్తుతం కరోనా  సంక్షోభం సమయంలో ఎన్నారైలు మోదీ సర్కార్ పై కాస్త ఆగ్రహంతోనే ఉన్నారు అని అందరూ అనుకుంటున్న మాట. ఏకంగా మోడీ ప్రభుత్వానికి ఎన్నారైలు శాపాలు  పడుతున్నరు అని టాక్ వినిపిస్తోంది. భారత్ వచ్చేందుకు మొన్నటికి మొన్న వందేమాతరం లాంటి విమానాలను పంపించు ఎన్నారైలను స్వదేశానికి రప్పించింది  కేంద్ర ప్రభుత్వం. 

 


 కానీ కొంతమంది రప్పించ కలిగింది కానీ పూర్తిస్థాయిలో ఎన్నారైలను వివిధ దేశాల నుంచి భారత్కు మాత్రం రప్పించుకోలేక పోయింది. ఎంతోమంది విద్యార్థులు విదేశాల్లోని ఇరుక్కుపోయారు. ప్రస్తుతం రావాలనుకున్నా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఎన్నారైలు మోడీ సర్కార్ చేపట్టిన ఫెసిలిటీస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా  సంక్షోభం సమయంలో తమ బంధువులు తల్లిదండ్రులు చనిపోయిన కూడా స్వదేశానికి రాలేని పరిస్థితి. 

 


 కరోనా సంక్షోభంలో  తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతుంటే పట్టించుకోలేని దుస్థితి వచ్చింది. ఎంత మంచి జాబ్ సంపద ఉన్న  ఏమిటి క్లిష్ట  సమయంలో కుటుంబ సభ్యులకు తోడుగా లేము  కదా అనే బాధ ప్రస్తుతం ఎన్నారైలను కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన అటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు ఎన్నారైలు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ఎన్నారైలను దశలవారీగా భారత్ తీసుకొస్తున్నాము అని చెప్పినప్పటికీ.. విదేశాల్లో ఉన్న ఎన్నారైల సంఖ్యకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని పలువురు భావిస్తున్నారు, మోదీ సర్కార్ పై  ఎన్నారైలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనే టాక్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: