దగ్గొస్తే దడపుడుతోంది... జలుబు, జ్వరం వస్తే ప్రాణం పోయినంత పనవుతోంది. ఏ మాత్రం అనుమానమొచ్చినా.. లక్షణాలు ఉన్నాలేకపోయినా.. కరోనా టెస్టులు చేయించుకుంటున్న వారిసంఖ్య పెరుగుతోంది. టెస్టుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్ తోపాటు సరోజిని, గాంధీ, ఫీవర్ హాస్పిటల్ వెళ్తున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు.

 

హైదరాబాద్ లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గల్లీ గల్లీలో కేసులు పెరుగుతున్నాయి. నిత్యం వేలల్లో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1892 కేసులు రాగా... జీహెచ్ ఎంసీ  పరిధిలోనే 1658 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో నగరవాసులకు దడ పుడుతోంది. ఏం ముట్టాలన్నా.. ఏం పట్టుకోవలన్నా గుబులురేగుతోంది.   
లక్షణాలు ఉన్నా... లేకపోయినా... టెస్టులు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అనుమానం వస్తే చాలు... టెస్ట్ చేయించుకోవాల్సిందే అనుకుంటున్నారు. సాధారణంగానో.. వాతావరణ మార్పుల వల్లనో... జలుబు వచ్చినా, జ్వరం దగ్గు వచ్చినా.. కరోనానేమో అని భయపడుతున్నారు.

 

ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబుల్లో కూడా కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతివ్వడంతో... టెస్ట్ లు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సరోజినీ హాస్పిటల్ కి నిత్యం జనాలు వస్తున్నారు. విజయ డయాగ్నోస్టిక్, మెడిసిస్, రెమిడీస్ వంటి ల్యాబుల్లోనూ టెస్టులు పెరిగాయి. లిమిట్ దాటింది.. పరీక్షలు చేయలేమని కూడా చెప్తున్న ల్యాబులున్నాయి.

 

కరోనా టెస్టులు పెంచుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సిటీలో టెస్టిం గ్ సెంటర్లు తగ్గిస్తోంది. గ్రేటర్ లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నా ఇలాంటి నిర్ణయం తీసుకుంటోంది. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జియాగూ డ, అంబర్ పేట, మలక్ పేట, గోల్కొండ ఏరియా హాస్పిటల్స్ లో టెస్ట్​లు బంద్ పెట్టింది.

 

జీహెచ్​ఎంసీ పరిధిలో డైలీ వేల కేసులు నమోదవుతుండగా, ఒక్కో పాజిటివ్ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్​లు కనీసం ముగ్గు రికి టెస్టులు చేయాల్సి ఉంటుంది. అలా 2,500కి పైగా టెస్ట్​ చేయాల్సి ఉండగా, వెయ్యి లోపే శాంపి ల్స్ తీసుకుంటున్నారు. దాంతో చాలామంది ప్రైవేట్ లో చేయించుకుంటున్నారు. పేదలు రోజుల తరబడి ప్రభుత్వ సెంటర్లకు తిరుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: